సెక్సీ సుందరిపై దర్శకనిర్మాతలు అంతర్ యుద్దం...!
అసిన్ నటించిన 'గజిని" సుమారు రెండు వందల కోట్లు కలెక్ట్ చేసింది. అసిన్ నటించిన మరో చిత్రం 'రెడీ" కూడా వంద కోట్లు పైగా కలెక్ట్ చేసింది. కరీనా కపూర్ ను మినహాయిస్తే..బాలీవుడ్ లో వంద కోట్లకు పైగా కలెక్ట్ చేసిన రెండు చిత్రాల్లో నటించిన హీరోయిన్లే లేరు. కరీనాకపూర్ నటించిన '3ఇడియట్స్" తో పాటు 'గోల్ మాల్3"కూడా వంద కోట్ల మార్క్ ను దాటాయి. అయితే కరీనా కపూర్ గత పదిపన్నెండు సంవత్సరాలుగా చిత్ర పరిశ్రమలో చిత్రవిచిత్రమైన కష్టాలు ఎదుర్కొంటూ ఈ రికార్డును ఇప్పటికి సొంతం చేసుకుంది.
కానీ అసిన్ అలా కాదు ఆమె నటించినవే మూడు సినిమాలు. ఆమె ిమందీ రంగప్రవేశం చేసి కూడా మూడేళ్లు లోపే. మూడేళ్ల మూడు సినిమాలు..వాటిలో రెండు సినిమాలు వంద కోట్లకు పైగా కలెక్ట్ చేయడమంటే మాటలు కాదు. అయితే ఇదంతా అసిన్ ఘనత కాదని, కేవలం అదృష్ట కొద్దీ వచ్చిందని చెబుతూ 'ఆమె జస్ట్ కమింగ్ యాక్ట్రెస్ మాత్రమే..స్టార్ కాదు" అంటూ అసిన్ ను ఘోరంగం అవమానిస్తున్నారు బాలీవుడ్ లో కొందరు దర్శకనిర్మాతలు. హిందీ చిత్ర ప్రముఖుడైన నిర్మాత ముఖేష్ భట్ కూడా అసిన్ ని ద్వేషించే వారి జాబితాలో చేరాడు. అసిన్ కున్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని పలువురు దర్శకనిర్మాతలు ఆమెను తమ సినిమాల్లో కి తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారని, అయితే సినిమాల ఎంపికలో ఆచితూచి వ్యవహరించే అసిన్..ఆ విషయంలో వారిని నిరాశకు గురి చేస్తున్నదని..దాంతో ఆమెను ఏదోవిధంగా అవమానించేందుకు అసిన్ స్టార్ కాదు అనే ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారని అసిన్ సన్నిహితులు వాపోతున్నారు.


Click it and Unblock the Notifications











