చిరంజీవితో సినిమా తీసేంత గట్స్, దమ్ నాకు లేవు...!?
చిరంజీవితో ప్రారంభించిన చిత్రం అర్థంతరంగా ఆగిపోయిందన్న బాధో, లేక ఆయన 150వ చిత్రానికి దర్శకత్వంల వెలగబెడతానని అరచి గీపెట్టినా దక్కలేదన్న కోపమో తెలియదు కానీ, సమయం దొరికినప్పుడట్టా చిరంజీవిని ఆడిపోసుకోవటంలో ఈ మధ్య బాగా ముందుకెళ్తున్నాడు వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఓ వైపు ప్రశంసలు కురిపిస్తున్నట్లుంటూనే, మరోవైపు సెటైర్లేసేలా కనిపించే వ్యాఖ్యల్ని తన ట్విట్టర్ లో చిరుపై సంధిస్తూ వస్తున్న వర్మ తాజాగా చిరంజీవి కాంగ్రెస్ తో కల్సి పోవటాన్ని కూడా వదల్లేదు. ఈ కామెంట్ చిరంజీవి చేతకాక పార్టీని మూసేసాడనా?లేక హీరోయిన్ గ్లామర్ గా ఉంటే చాలు సినిమా కలెక్షన్లు కురిపిస్తుందనా? చిరు-కాంగ్రెస్ ల కాంబినేషన్ హిట్టా, ఫట్టా? వర్మ ట్విట్ తిట్టో ప్రశంసో అర్థం కాక తెగ బాధపడిపోతున్నారు చిరు అభిమానులు.
తాను ఎప్పుడూ తన చిత్రాల్లో హీరోయినక్లే ప్రాధాన్యత ఎక్కువ ఇస్తానని చెప్తూ..చిరంజీవి ఓ గ్లామర్ హీరోయిన్, కాంగ్రెస్ ఓ హీరో మాత్రమే అంటూ ట్విట్ చేసాడు. అయితే రియల్ గా అతనితో సినిమా చేయాలన్నా కలిసినరావటంలేదు, ఒక వేళ కలసొచ్చినా చిరంజీవికి ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ కి ఆయనతో సినిమాతీసేంత గట్స్, దమ్ నాకులేవని రీసెంట్ గా ఓ చానల్ ద్వారా తెలిపారు.


Click it and Unblock the Notifications











