త్రిష, శ్రియ, లిస్ట్ లోనికి అసిన్ కూడా చేరిందా!
డబ్బు ముందు అందరూ దాసోహులే అన్నది నిజమేనేమో! సినిమా ఇండస్ట్రీలో పలుకుబడికి చిహ్నం పార్టీలు పబ్ లు అవి లేకపోతే లైఫ్ వేస్టనుకొంటారు. లేదా ఆఫర్లు రావనుకొంటారు మరికొందరు. మొన్న ఆ మద్య త్రిష తర్వాత శ్రియ పబ్ ల్లో తాగి తందనాలు ఆడిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో కేరళ కుట్టి అసిన్ బాలీవుడ్ కి వెళ్ళిన తర్వాత స్టైలే మార్చేసింది. పబ్ ల్లో జరిగే పార్టీలకు కూడా వెళ్ళిపోతోంది. బాలీవుడ్ అంటే స్పీడ్ కల్చర్ ఉంటుంది. అసిన్ దానికి అలవాటు పడిపోయి ఉంటుందని చాలా మంది అనుకొంటున్నారు. కానీ అసిన్ లా అనుకోవడం తప్పు అని చెబుతోంది..పార్టీలకు వెళితే తప్పా? నా వయసు ఉన్న వాళ్లు పార్టీలకు వెళ్ళడం నేరం కాదు. కానీ హద్దులు దాటితేనే నేరం. నేను నా హద్దుల్లో ఉంటాను. సిగరెట్లు, మందు జోలికి అసలు వెళ్ళను అని కాకమ్మ కథలు వల్లిస్తోంది.
తమిళంలో దశావతారం తర్వాత చాలా గ్యాప్ తర్వాత ప్రస్తుంతం సిద్దిక్ దర్శకత్వంలో మళయాల చిత్రం బాడిగార్డ్ రీమేక్ 'కవల్కారన్" లో విజయ్ సరసన నటిస్తోంది. ఈ చిత్రం తర్వాత తిరిగి బాలీవుడ్ లో జాన్ అబ్రహాంతో 'ఘర్షణ" రీమేక్ మరయు సల్మాన్ ఖాన్ తో 'అనీజ్ బజ్మీ" రీమేక్ లో నటించనుంది.


Click it and Unblock the Notifications











