ప్రకాష్ రాజ్ కు విషం పెట్టి చంపాలనుకొన్నా...!?

By Sindhu

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కు దాదాపు నాలుగు నెలల వయసున్నప్పుడు ఆయన కన్నతల్లి విషంపెట్టి చంపాలని చూసింది. నర్స్ కోర్స్ పూర్తిచేసిన ప్రకాష్ తల్లి ప్రేమవివాహం చేసుకుంది. కానీ బిడ్డ పుట్టిన వెంటనే మొహం చాటేశాడు ఆయన తండ్రి.

ఇక ఈ బతుకు బతకడం వ్యర్ధమని భావించిన తను ముందు పసిబిడ్డను కడతేర్చి ఆ తర్వాత తను విషం తాగడానికి సిద్దమైంది. కాని ఆ చిన్నారి నవ్వుతూ ఉగ్గు గిన్నెలో విషం కలిపిన పాలను తాగాబోయాడు. ఆ నవ్వు చూసి అతణ్ణి తల్లి అమాంతం గుండెలకు హత్తుకుంది. ఉగ్గు గినేన్ను విసిరేసి తనివి తీరా ఏడ్చింది. అప్పుడు కూడా పిల్లాడు నవ్వుతూనే వున్నాడు.

కొడుకు నవ్వును చూసి ధైర్యం తెచ్చుకున్న ప్రకాష్ తల్లి ఆ ఆలోచనను విరమించుకుంది. ఒకవేళ అప్పుడు ప్రకాష్ రాజ్ తల్లి మనోవేదనతో నిర్ణయం తీసుకొని వుంటే ఈ రోజు మనకు ఓ విలక్షణ నటుడు వుండేవాడు కాదు కదా. ప్రకాష్ రాజ్ దక్షిణ భారతదేశానికి చెందిన ఒక సుప్రసిద్ధ నటుడు. దాదాపు రెండు వందల సినిమాలకు పైగా నటించి, ఐదు భారతీయ భాషల మీద పట్టున్న విలక్షణ నటుడు. ఇప్పటిదాకా నాలుగు జాతీయ పురస్కారాల్ని అందుకున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X