బ్యూటిఫుల్ ఐశ్వర్య ప్రెగ్నెంట్ విషయంలో రామ్ గోపాల్ వర్మ టంగ్ స్లిప్..!
బ్యూటిఫుల్ అమ్మాయిలకు నేను పెద్ద అభిమానిని అని రామ్ గోపాల్ వర్మ చెబుతుంటాడు. గతంలో జగదేక సుందరి శ్రీదేవి అందాన్ని రామ్ గోపాల్ వర్మ తెగ పొగిడేసేవాడు. తాజాగా అందాల సుందరి ఐశ్వర్య రాయ్ గర్భం దాల్చింది అనే వార్త బయటికి రాగానే... అందగత్తే గర్భం దాల్చితే ఎలా ఉంటుంది దీనిపై ఎవరికి ఏ అభిప్రాయం ఉందో తెలీదు కానీ.. వెరైటీ రామ్ గోపాల్ వర్మ మాత్రం బ్యూటీ లేడిస్ ప్రెగ్నెంట్ అయితే అసహ్యంగా ఉంటుందంటున్నాడు. తన ట్విట్టర్ లో లేటెస్ట్ గా ఐష్ తల్లి కాబోతుందనే వార్తపై ఓ ట్విట్ పోస్ట్ చేశాడు. అందులో అందగత్తెలు గర్భం దాల్చడం అసహ్యంగా ఉంటుందని అన్నారు.
అయితే ఐశ్వర్య విషయంలో మాత్రం మినహాయింపు అని ట్విట్టర్‌లో చెప్పకొచ్చాడు. అంటే ఐశ్వర్య విషయంలో విషయంలో వర్మ ఎందుకు మినహాయింపు ఇచ్చారో అర్థం కానీ పరిస్థితి. ఐశ్వర్య అందగత్తే కాదని వర్మ అభిప్రాయమా.. లేక ఐష్ పని అయిపోయిందని అనుకున్నారో తెలీదు కానీ.. వర్మ మాత్రం ఐష్ పై అభ్యంతరం తెలుపలేదు. ఇక తొలిసంతానానికి జన్మనిస్తున్న అభిషేక్ దంపతులకు శుభాకాంక్షాలు తెలిపిన వర్మ.. అటు అమితాబ్‌ను పొగడుకుంటూ వచ్చారు.


Click it and Unblock the Notifications











