షూటింగ్ లో కన్నీళ్ళపర్యంతమైన ‘పులి’ హీరోయిన్
తన తొలిచిత్రంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నటించే ఛాన్స్ కొట్టేసిన బ్యూటీ నిఖీషా పటేల్ 'కొమరం పులి" షూటింగ్ పూర్తయిన రోజున యూనిట్ వదిలి వెళ్ళలేక కన్నీళ్ళ పర్యంతమైంది. దాదాపు రెండు సంవత్సరాలపాటు నిఖీషా అందించిన సహకారానికి దర్శకుడు ఎస్ జె సూర్య కృతజ్ఝతలు చెప్పగానే ఆమె వెంటనే కన్నీళ్ళు పెట్టుకుంది. 'ఈ రెండేళ్ళ లో నేను ఎంతో నేర్చుకున్నాను. రీసెర్చ్ చేసి పిహెచ్ డి చేసిన ఫీలింగ్ కలుగుతోంది. ఫ్యూచర్ లో నేను చేయబోయే సినిమాలకు ఈ అనుభవం ఎంతో ఉపయోగపడుతోంది. ఈ సినిమాకి సంబంధించిన నాకు మరో సంతోషకరమైన విషయం ఏమిటంటే నేను ఎంతో అభిమానించే ఎఆర్ రెహమాన్ గారు ఈ సినిమాకి మ్యూజిక్ చెయ్యడం. నా స్కూల్ డేస్ లో వందేమాతరం" పాటను స్టేజ్ పై పెర్ ఫార్మ చేశాను. నేను కొమరం పులి" టీమ్ ని విడిచి వెళ్తున్నందుకు ఎంతో బాధగావుంది మళ్ళీ మళ్ళీ మీ అందరినీ కలుసుకోవాలని వుంది" అంది నిఖీషా పటేల్.


Click it and Unblock the Notifications











