దిల్ రాజు తో డేటింగ్ చేయటం లేదంటూ హీరోయిన్

By Srikanya

హైదరాబాద్ : ప్రముఖ నిర్మాత దిల్ రాజు తో తనకు ఎలాంటి రిలేషన్ లేదని కొట్టిపారేసింది హీరోయిన్ షీలా. దిల్ రాజు బ్యానర్ లో వచ్చిన పరుగు చిత్రంలో చేసిన ఆమెకు ఆ నిర్మాత ని డేటింగ్ చేస్తోందంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఇంతకాలానికి ఆమె వాటిని కొట్టిపారేసింది. అయితే ఇంత ఆలస్యంగా ఇప్పుడు హఠాత్తుగా ఈ టాపిక్ తో జనాలలోకి రావటమెందుకు అనేదే ఎవరికీ అర్దం కాలేదు.

షీలా మాట్లాడుతూ...తాను టాలీవుడ్ లో ఎవరితోనూ టచ్ లో లేనని అంది. దిల్ రాజు ని చివరగా అదుర్స్ ఆడియో ఫంక్షన్ లోనే చూసానని అన్నారు. అసలు నా దగ్గర దిల్ రాజు నెంబర్ కూడా లేదని అన్నారామె. నేను గత సంవత్సర కాలంగా యు.కె లో ఉంటున్నాను. తెలుగు పరిశ్రమలో నాకు ప్రత్యేకంగా స్నేహితులంటూ ఎవరూ లేరు.

 I'm not dating Dil Raju: Heroine Sheela

నేను ఎప్పుడైనా హైదరాబాద్ రావటం తటస్ధించినా పని అయినా వెంటనే చెన్నై వెళ్లిపోయేదాన్ని. నేను అందరితో కలిసేదాన్ని కాదు. ఇక పరుగు చిత్రంలో దిల్ రాజు రికమండేషన్ తోనే ప్రాజెక్టులోకి వచ్చేనన్న విషయాన్ని ఆమె కొట్టిపారేసారు. అలాటిదేమీలేదు. మొదట అల్లు అరవింద్ గారే నన్ను చూసి, ఫొటో షూట్ కి పిలిచారు అని చెప్పారామె.

పరమవీరచక్ర చిత్రం తర్వాత షీలా తెలుగు తెరపై కనిపించలేదు. మళ్లీ తిరిగి ఎప్పుడు తెలుగు రానున్నారు అనే విషయం మాట్లాడుతూ... " ఇంప్రెస్ చేసే స్క్రిప్టుతో ఎవరైనా వస్తే తప్పుకుండా తిరిగి వస్తాను..అదే సమయంలో ఎన్ని రోజులు షూటింగ్ డేస్ ఉంటాయనేది కూడా నాకు ముఖ్యమే..ఆ రెండు చూసుకునే నేను డెశిషన్ తీసుకుంటాను" అంది షీలా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X