»   » రాజమౌళి బ్రెయిన్ వాష్ తోనే ప్రభాస్?

రాజమౌళి బ్రెయిన్ వాష్ తోనే ప్రభాస్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రాజమౌళి, ప్రభాస్ మధ్య అనుభంధం కేవలం దర్సకుడు, హీరో మధ్య ఉన్నది కాదు...మంచి స్నేహితుల్లా వ్యవరిస్తారని చెప్పుతూంటారు. అదే చనువుతో...ప్రభాస్ కి బ్రెయిన్ వాష్ చేసాడని, దాని ఫలితమే తనపై వచ్చిన రూమర్స్ పై పత్రికాముఖంగా ఖండన ఇవ్వటానికి ముందుకు వచ్చాడంటున్నారు. రూమర్స్ ని ఎప్పటికప్పుడు ట్విట్టర్ ద్వారా ఖండించే రాజమౌళి...ఈ విషయంలో ప్రభాస్ కి సలహా ఇచ్చారని, ఇలాంటి రూమర్స్ ని మొదట్లోనే కట్ చేయాలని చెప్పినట్లు చెప్పుకుంటున్నారు. ఇటీవల ఆయన గురించి అనేక పుకార్లు చెలరేగుతున్నాయి. దీంతో వీటన్నింటికి ఫుల్‌స్టాప్‌ పెట్టడానికి ఆయన వివరణ ఇచ్చారు. తన ఫేస్‌బుక్‌ పేజీ ద్వారా పుకార్లపై సమాధానమిచ్చారు.

ప్రభాస్ ఖండిస్తూ... ''నేను తీవ్ర అనారోగ్యం పాలయ్యానంటూ వచ్చిన వార్తలు నిజం కాదు. వై.ఎస్‌.షర్మిలతో నాకు సంబంధం ఉందంటూ వస్తున్న పుకార్లు సత్యదూరం. ఈ విషయాలు నన్ను, నా కుటుంబాన్ని తీవ్ర మనస్తాపానికి గురి చేస్తున్నాయి'' అన్నారు ప్రభాస్‌. ''నాకు, షర్మిలగారికి ఎటువంటి సంబంధం లేదు. ఆమెతో ఇప్పటివరకు నేను మాట్లాడలేదు కూడా. గతంలో నా ఆరోగ్యంపై పుకార్లు వచ్చినప్పుడు నేను పెద్దగా స్పందించలేదు. వాటంతట అవే సమసిపోతాయని వదిలేశాను. పుకార్లను పట్టించుకోకుండా ఉంటేనే మంచిదనేది అప్పుడు నా అభిప్రాయం.

I never met Sharmila before: Prabhas

అయితే ఇప్పుడు నా మీద మీద వస్తున్న పుకార్లు మరొకరి జీవితాన్ని ఇబ్బందిపెడుతున్నాయి అందుకే ఇప్పుడు స్పందిస్తున్నాను. వాటిని ఖండిస్తున్నాను. పెళ్త్లె, పిల్లలున్న ఓ మహిళ విషయంలో ఇలాంటి పుకార్లు రావడం బాధాకరం. అందుకే ప్రకటన ఇస్తున్నాను. అంతేగానీ నాకెటువంటి రాజకీయ ఉద్దేశాలు లేవు. నాకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధాలు లేవు ఈ విషయం అందరికీ తెలిసిందే. ఇలాంటి అసత్య విషయాలు ఆగడానికి ఏం చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. పోలీసులు, సంబంధిత అధికారులు ఈ విషయమై సరైన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను'' అంటూ రాసుకొచ్చారు ప్రభాస్‌.

English summary
Prabhas said: "There have also been several embarrassing rumours about my alleged relationship with Ms. Y. S. Sharmila. I would like to categorically state that I have never met or spoken to Ms. Y. S. Sharmilla and the rumours in circulation are completely baseless and have not even an iota of truth in them.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu