»   » పదికోట్లు ఇచ్చిన ఆ పని చేయను: ఆసిన్

పదికోట్లు ఇచ్చిన ఆ పని చేయను: ఆసిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

పదికోట్లిచ్చినా బికినీ వేసుకుని తెరపై అందాల్ని ఆరబోయను..పాతిక కోట్లు ఇచ్చినా లిప్ టు లిప్ కిస్ ఎవరికీ ఇవ్వను..అంటోంది దక్షిణాది నుంచి బాలీవుడ్ కి వెళ్ళి, అక్కడే సెటిలైపోయిన మలయాళీ ముద్దుగుమ్మ ఆసిన్. తెలుగు తమిళ పరిశ్రమల్లో నెంబర్ వన్ పొజిషన్ వదిలేసుకుని వచ్చింది అర్థనగ్నంగా తెరపై కన్సించడానికి కాదనీ, నటిగా రీచ్ ఎక్కువ ఉంటుందనే బాలీవుడ్ సినిమాలపై ఆసక్తి కనబరుస్తున్నాను తప్ప, డబ్బు కూడగట్టుకోవడం కోసం అడ్డదారి తొక్కబోనని అసిన్ స్పష్టం చేసింది. వున్నపళంగా అసిన్, ఇంత ఘాటుగా స్టేట్ మెంట్స్ ఇవ్వడం వెనుక అసలు ఉద్దేశ్యం ఏమిటో తెలుసా..? ఇంకేముంది. తనకు పోటీగా బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోన్న త్రిష పై అక్కసు వెల్లగక్కడమే. 'కట్టామీటా"లో పద్దతిగా వుండే పాత్ర పోషిస్తున్నప్పటికీ, పబ్లిసిటీ కోసం త్రిష హాట్ హాట్ గా ఫోటో సెషన్లు ఇచ్చేయడం అసిన్ కి ఏమాత్రం రుచించడంలేదట.

తన సన్నిహితుల వద్ద, 'త్రిష బరితెగించేసింది.." అంటూ అసిన్ కామెంట్లేయడం కూడా మొదలు పెట్టేసిందట. అయినా, పదికోట్లిచ్చినా బికినీ వేయననీ, పాతిక కోట్లిచ్చినా లిప్ టు లిప్ కిస్ ఇవ్వననీ చెబుతున్న అసిన్ ని, అసలు నీ పారితోషికమెంతమ్మా..అనడిగితే మాత్రం, 'ఆ ఒక్కటీ అడగొద్దు" అంటోందామె. ప్రస్తుతం బాలీవుడ్ లో అసిన్ మార్కెట్ గట్టిగా కోటి రూపాయలు కూడా లేదనేది ఓ బాలీవుడ్ జనం చెబుతోన్న మాట.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu