»   » పెదవులపై చెరగని చిరునవ్వు..కళ్లల్లో చిలిపిదనంతో..ప్రేమించి పెళ్ళాడితే..!?

పెదవులపై చెరగని చిరునవ్వు..కళ్లల్లో చిలిపిదనంతో..ప్రేమించి పెళ్ళాడితే..!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

పెదవులపై చెరగని చిరునవ్వు..కళ్లల్లో చిలిపిదనం..చూడగానే మళ్లీ మళ్లీ చూడాలనిపించే అందం..కలగలిస్తే మనసంతా..తుళ్లింతలు రేపే 'ఏదో మాయ చేసిన" సమంత..నటించిన ఒక్క చిత్రంతోనే పెద్ద నిర్మాతల దృష్టిని తనవైపుకు తిప్పుకుంది. పెద్ద హీరోలతో నటించబోతోంది. ప్రస్తుతం జూ ఎన్టీఆర్‌ తో 'బృందావనం", మహేష్‌ బాబుతో శ్రీనువైట్ల దర్శకత్వంలోనూ నటిస్తున్న సమంత తన చిన్ననాటి ముచ్చట్లు చెబుతూ స్కూల్‌ డేస్‌ జీవితంలో ఎన్నటికి మర్చిపోలేనివంటోంది. తాను స్కూల్‌ డేస్‌ లో ఉండగా ఒకబ్బాయితో ప్రేమలో పడిందట…అయితే కారణాంతరాల వల్ల అది ఆ లెవెల్‌ లోనే మర్చిపోవాల్సివచ్చిందట.

ఆ తర్వాత బుద్దిగా చదువుమీద దృష్టి కేంద్రీకరించానంటోంది. మళ్లీ అప్పటినుంచి ఇప్పటిదాకా ప్రేమ అనే పదం తన జీవితంలో వినిపించనీయలేదన్నారు. అయితే ప్రేమవివాహాలపై తన కచ్చితమైన అభిప్రాయాన్ని మాత్రం చెబుతోంది సమంత. 'నా దృష్టిలో పెద్దవాళ్లు ఎరేంజ్‌ చేసే పెళ్లి కన్నా…ప్రేమ వివాహమే గొప్పది. అలాగని నేనేమీ ప్రస్తుతానికి ప్రేమలో పడలేదు. కాకపోతే భవిష్యత్‌ లో మాత్రం ప్రేమలో పడితే పడొచ్చు" అంటోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu