శ్యామ్ ప్రసాద్ రెడ్డి కోసమే త్రిష తిప్పలు
'అరుంధతి' లాంటి సినిమాలో చేయాలి. అప్పుడే నేను చేసినా..మీరు చూసినా ఓ విలువ...అంటూ తరుచుగా చెప్పుకొస్తోంది త్రిష. ఏంటి హఠాత్తుగా త్రిష దృష్టి అరుంధతి పై పడింది...రిలీజై చాలా కాలం అయింది కదా అని ఎంక్వైరీ చేసిన వాళ్ళకు త్రిష అసలు ఆలోచన అర్దమైంది. అనుష్కకు 'అరుంధతి' వంటి హిట్ ఇచ్చి స్టార్ హీరోయిన్ గా చేసిన శ్యామ్ ప్రసాద్ రెడ్డి నెక్ట్స్ పిక్చర్ లో అవకాశం సాధించేందుకు, ఆయన దృష్టిని ఆకట్టుకునేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తోందని, ఆమె ఇంతుకుముందు కూడా గౌతమ్ మీనన్ ని ఇలాగే పొగిడి ఏమి మాయ చేసావే తమిళ వెర్షన్ లో ఆఫర్ సాధించిందని, ఇలాంటి స్కీమ్ లు ఆమెకు కొత్తేమీ కాదని చెప్తున్నారు. అలాగే ఆమె..సినిమారంగంలో హీరోల ఆధిపత్యమే ఎక్కువ. ఇక్కడ పదికాలాల పాటు హీరోయిన్ గా చెలామణీ అవ్వాలంటే..ఇలాంటి పాత్రలు చేయక తప్పదు. నాక్కూడా స్త్రీ ప్రాధాన్యత గల సినిమాల్లో చేయాలని ఉంది. కానీ చేస్తే అలాంటి ఇలాంటి సినిమాల్లో చేయకూడదు. 'అరుంధతి' లాంటి సినిమాలో చేయాలి అంది. ఇంతకీ శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఈ మాటలు విన్నారో లేదో...చూడాలి.


Click it and Unblock the Notifications











