Allu Arjun Trivikram 300 కోట్లతో అల్లు అర్జున్ త్రివిక్రమ్ మూవీ.. స్టోరీ బ్యాక్‌డ్రాప్ ఏంటో తెలుసా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం.. దేశం మొత్తం ఎదురు చూస్తున్నారు. ఇక ఈ మూవీ తర్వాత బన్నీ... త్రివిక్రమ్ తో కలిసి ఓ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి ఆసక్తికర అప్డేట్స్ వచ్చాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి స్టోరీ లీక్ అయింది. ఇప్పుడు ఈ సినిమా బడ్జేట్, షూటింగ్ అప్డేట్, హీరోయిన్ ఫిక్స్ వివరాలు బయటకు వచ్చాయి. ఈ స్టోరీలో వాటి గురించి తెలుసుకుందాం.
పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతుంది. సుకుమార్ దర్శకత్వంలో రష్మిక మందన్నా హీరోయిన్ గా పుష్ప 2 తెరకెక్కుతుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 15వ తేదీన రిలీజ్ కాబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ సినిమా కోసం.. ఒక్క తెలుగు ప్రేక్షకులే కాదు.. దేశం మొత్తం ఎదురు చూస్తుంది. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

బన్నీ పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాను ఇదివరకే అధికారికంగా ప్రకటించారు. జులాయి, సన్ ఆఫ్ సత్య మూర్తి, అల వైకుంఠపురంలో సినిమాల తర్వాత నాలుగవ చిత్రం వీరి కాంబినేషన్ లో తెరకెక్కనుంది. ఇక ఈ మూవీ పాన్ వరల్డ్ చిత్రంగా రాబోతుందని తెలుస్తోంది. అంతే ఈ సినిమా స్టోరీ ఇంతకు ముందే లీక్ అయింది. పిరియాడిక్ డ్రామాగా... భారత స్వాతంత్ర్య ఉద్యమం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని టాక్ వినిపించింది.
ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి దిమ్మతిరిగే లేటెస్ట్ అప్డేట్స్ వచ్చాయి. ఈ సినిమా స్క్రిప్ట్ ఫైనల్ చేసే పనిలో త్రివిక్రమ్ ఉన్నారట. ప్రస్తుతం మహేశ్ బాబుతో గుంటూరు కారం సినిమా తెరకెక్కిస్తున్నాడు త్రివిక్రమ్. ఈ సినిమా చివరి దశకు చేరుకుంది. వచ్చే ఏడాది జనవరి 12న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఈ డిసెంబర్ కల్లా ఈ సినిమాను ఫినిష్ చేసి.. బన్నీ సినిమాపై ఫోకస్ చేయనున్నాడు గురూజీ.

బన్నీ, త్రివిక్రమ్ సినిమాకు రూ. 300 కోట్లతో తెరకెక్కించనున్నారట. ఈ సినిమా డిసెంబర్ నుంచి స్టార్ట్ కానుందని సమాచారం. హారిక, హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ కలిసి సంయుక్తంగా ఈ సినిమాను రూపొంచనున్నాయి. ఇక ఈ సినిమాకు తమన్ సంగీతం అందించనున్నారు. మొత్తానికి తమ నాలుగో చిత్రాన్ని త్రివిక్రమ్, బన్నీ గ్రాండ్ గా ప్లాన్ చేసి హిట్ కొట్టాలని చూస్తున్నారట. ఇక ఈ సినిమాలో అందాల భామ త్రిషను తీసుకోవాలని అనుకుంటున్నారు.
ఈ విషయం తెలుసుకున్న అభిమానులు... బన్నీ, త్రివిక్రమ్ సినిమాకు 300 కోట్ల రూపాయలు ఎందుకు అని అంటున్నారు.త్రివిక్రమ్ సినిమాలు, డైలాగులు తెలుగు వారికి బాగా కనెక్ట్ అవుతాయి. త్రివిక్రమ్ సినిమాల్లో స్టోరీ గొప్పగా లేకపోయినా... ఓ ఎమోషన్ ఉంటుంది. అది తెలుగు వారికి మాత్రమే కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఇన్నీ కోట్లు పెట్టి.. పాన్ ఇండియా సినిమా తీస్తే.. అన్ని భాషల్లో కనెక్ట్ కావాలని లేదు అంటున్నారు ఫ్యాన్స్. అన్ని కోట్లతో మా బన్నీని ముంచుతావా ఏంటి అంటూ త్రివిక్రమ్ పైనా ఫైర్ అువుతున్నారు. చూడాలి మరి ఏం జరగనుందో.


Click it and Unblock the Notifications











