Allu Arjun: చిరంజీవి వల్ల డబ్బులు పొగొట్టుకున్న అల్లు అర్జున్.. ఎంతో తెలిస్తే షాకే!

మెగాస్టార్ చిరంజీవి తర్వాత అదే కుటుంబం నుంచి నాగబాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ ఇలా చాలా మంది సినీ రంగ ప్రవేశం చేసి తమ టాలెంట్ తో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో దాదాపు చాలామంది సఫలమయ్యారు కూడా. ఇప్పుడు మరికొంతమంది హీరోలు కూడా ఎంట్రీ ఇచ్చారు కానీ... మెగాస్టార్ చిరంజీవి కారణంగా అల్లు అర్జున్ భారీగా డబ్బులు నష్టపోయారట. ఈ విషయాన్ని తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు బన్నీ. అసలు చిరంజీవి వాళ్ల అల్లు అర్జున్ ఎందుకు డబ్బులు రాష్టపోయాడనే వివరాల్లోకి వెళితే...

మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లో సూపర్ హిట్ గా నిలిచిన సినిమాలలో ఇంద్ర సినిమా కూడా ఒకటి. పూర్తిస్థాయి ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికీ చాలామందికి హాట్ ఫేవరెట్. ఈ సినిమాలో పాటలు, ఫైట్లు, డైలాగులు ఇప్పటికీ నిజజీవితంలో ఏదో ఒక సమయంలో గుర్తుకు రావడం లేక నోటి వెంట పలకడమో చేస్తూ ఉంటారు చాలామంది.

Icon Star allu Arjun lost money Due to Megastar Chiranjeevi in Betting Full details Here

అయితే ఈ సినిమాలో దాయి దాయి దామ్మా... కులికే కుందనాల బొమ్మా... నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మా... అనే సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పాట కారణంగా అల్లు అర్జున్ దాదాపు 25 వేలు నష్టపోయినట్లుగా తెలుస్తోంది. అసలు విషయం ఏమిటంటే ఈ పాటలో మెగాస్టార్ చిరంజీవి వేసిన వీణ స్టెప్ చాలామందికి ఇప్పటికీ ఇష్టం. అందులో ఆయన డాన్స్ చేసే విధానం కానీ ఆయన గ్రేస్ కానీ చాలా బాగుంటుంది.

ఈ నేపథ్యంలో ఈ పాటలో మెగాస్టార్ చిరంజీవి డాన్స్ గురించి చర్చ జరుగుతున్న సమయంలో అల్లు అర్జున్ తన స్నేహితుడితో కలిసి ఒక పందెం కట్టాడు. అదేమంటే అల్లు అర్జున్ ఈ పాటకి మెగాస్టార్ డాన్స్ చేస్తున్న సమయంలో ఒక్కడే ఉంటాడు.. చుట్టూ ఎవరూ ఉండరని చెబుతాడు. కానీ అతని స్నేహితుడు మాత్రం మెగాస్టార్ డాన్స్ చేస్తున్నప్పుడు పక్కన సోనాలి బింద్రే ఉంటుందని అంటాడు. ఈ ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి ఇద్దరు బెట్టుకట్టుకుంటారు.

Icon Star allu Arjun lost money Due to Megastar Chiranjeevi in Betting Full details Here

అల్లు అర్జున్ ఏమో మెగాస్టార్ చిరంజీవి డాన్స్ చేస్తున్నప్పుడు ఒక్కడే ఉంటాడని పాతికవేల రూపాయలు పెట్టి కడితే... అతని స్నేహితుడు మాత్రం మెగాస్టార్ డాన్స్ చేస్తున్నప్పుడు పక్కన సోనాలి బింద్రే కూడా ఉంటుందని బెట్ కట్టాడు. అప్పటికే 17 సార్లు సినిమా చూసిన అల్లు అర్జున్ మరోసారి ఈ బెట్టు కోసం సినిమా చూస్తే అప్పుడు పక్కన సోనాలి బింద్రే కనిపించిందట.

అప్పుడు తన స్నేహితుడి దగ్గరికి వెళ్లి నువ్వు చెప్పిందే నిజం... కానీ పక్కన హీరోయిన్ ఉన్న ఆమె వైపు కంటి చూపు కూడా వెళ్లకుండా చిరంజీవి గారి డాన్స్ చూసేలా చేసింది. అందుకే తాను ఇప్పటివరకు ఆమె అక్కడ ఉందనే విషయం కూడా గుర్తించలేకపోయానని ఒప్పుకుని పాతికవేల రూపాయలు ఇచ్చాడట. అలా మెగాస్టార్ చిరంజీవి కారణంగా అల్లు అర్జున్ పాతికవేల రూపాయలు నష్టపోయాడు అన్నమాట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X