సొంతంగా కథ రాసుకునే ఆలోచనలో అల్లు అర్జున్ ప్లాన్.. అందుకే ఈ విధంగా..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మొత్తానికి పుష్ప సినిమాతో తన మొదటి పాన్ ఇండియా విజయాన్ని సొంతం చేసుకున్నాడు.. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కేవలం తెలుగులోనే కాకుండా హిందీ తమిళంలో కూడా మంచి విజయాన్ని అందుకుంది ముఖ్యంగా బాలీవుడ్ లో అయితే ఎవరూ ఊహించని విధంగా 100 కోట్ల నెట్ కలెక్షన్ తో ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక రాబోయే సినిమాలు మరింత సక్సెస్ అవ్వాలని అల్లు అర్జున్ ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇక సొంతంగా ఒక కథ కూడా రాసుకుంటున్నట్లు తెలుస్తోంది.

పుష్ప భారీ విజయం

పుష్ప భారీ విజయం

బాలీవుడ్ లో ఇటీవల కాలంలో ఏ సినిమా కూడా 100కోట్ల కలెక్షన్స్ అందుకోలేదు. 200కోట్లకు పైగా మార్కెట్ ఉన్న రణ్ వీర్ సింగ్ కూడా 83 లాంటి సినిమాతో కూడా తన మార్కెట్ కు తగ్గట్టుగా వసూళ్లను సాదించలేకపోయాడు. ఇక అల్లు అర్జున్ పుష్ప మాత్రం కేవలం 10కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో హిందీ లో విడుదలై భారీ స్థాయిలో వంద కోట్ల నెట్ వసూళ్లను సాధించింది.

ప్రభాస్ తరువాత

ప్రభాస్ తరువాత

ఫైనల్ గా అల్లు అర్జున్ తనకంటూ సొంతంగా ఒక ఫ్యాన్ ఇండియా మార్కెట్ ను క్రియేట్ చేసుకోగలిగాడు. ప్రభాస్ తర్వాత ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ స్టార్ గా బన్నీ రికార్డు క్రియేట్ చేశాడు. పుష్ప సినిమా సక్సెస్ కావడంతో దానికి కొనసాగింపుగా రాబోయే రెండవ భాగం పై కూడా అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

 తొందర పడకుండా నిర్ణయాలు

తొందర పడకుండా నిర్ణయాలు

అయితే భవిష్యత్తులో రాబోయే సినిమాలు అంతకుమించి అనేలా ఉండాలి అని అల్లు అర్జున్ మరింత జాగ్రత్తగా అడుగులు వేయాలని అనుకుంటున్నాడు. ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు అని తదుపరి సినిమాల విషయంలో తొందర పడకుండా నిర్ణయాలు తీసుకోవాలని అనుకుంటున్నాడు. ఇటీవల అల్లు అర్జున్ కొంత రెస్ట్ తీసుకోవడానికి దుబాయ్ వెళ్ళాడు. ఇక అక్కడే తన కుటుంబ సభ్యులతో కలిసి హాలిడేస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు.

అల్లు అర్జున్ సొంత స్టోరీ..?

అల్లు అర్జున్ సొంత స్టోరీ..?

అంతేకాకుండా అల్లు అర్జున్ మొదటి సారి ఒక ఐడియాతో కథను అల్లుతున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల కాలంలో కొంతమంది హీరోలు సొంతంగా వారి కథలను వాడే రాసుకుంటున్న విషయం తెలిసిందే. అమీర్ ఖాన్ ధనుష్ వంటి వారు సొంత కథలతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను అందుకున్నారు. ఇక అల్లు అర్జున్ కూడా అదే తరహాలో తన సొంత ఆలోచనలతో సక్సెస్ కొట్టాలని చూస్తున్నాడని సమాచారం.

మొదటిసారి ఇలా..

మొదటిసారి ఇలా..

అల్లు అర్జున్ కథలపై మంచి పట్టు ఉంది అనే అతను సినిమాలను చూస్తే అర్థమవుతుంది. ఏ సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనే విషయం లో అతనికి మంచి అనుభవం ఉంది. ఇక అల్లు అర్జున్ ఇటీవల ఒక కొత్త ఐడియాతో కొంతమంది తనకు తెలిసిన రచయితల తో కూడా చర్చలు జరిపినట్లు సమాచారం.

వారి నుంచి మంచి సలహాలు తీసుకుంటూ తనదైన శైలిలో ఒక పవర్ఫుల్ కథను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దుబాయ్ ట్రిప్ అయిపోయేలా గా ఆ కథ విషయంలో ఒక కొలిక్కి రావాలని ఆలోచిస్తూ ఉన్నాడట. మరి అల్లు అర్జున్ రాస్తున్న మొదటి స్టోరీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X