Allu Arjun పవర్ఫుల్ లైనప్.. సందీప్ రెడ్డితో పాటు లిస్టులో మరో ముగ్గురు స్టార్ దర్శకులు.. ఎవరెవరంటే?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 మూవీ షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ మూవీ తర్వాత బన్నీ పాన్ ఇండియా సినిమాలని బ్యాక్ టూ బ్యాక్ లైన్ లో పెట్టబొతున్నట్లు అర్ధమవుతోంది. ప్రస్తుతం ఉన్న లైనప్ చూస్తుంటే రాబోయే రోజుల్లో బన్నీ రేంజ్ మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. భవిష్యత్తులో బన్నీ ఏ దర్శకులతో చేయబోతున్నాడు అనే వివరాల్లోకి వెళితే..

పుష్ప 2తో బిజీగా

పుష్ప 2తో బిజీగా

మన స్టార్ హీరోలు అందరూ కూడా ఇదే పంథాలో బ్యాక్ టూ బ్యాక్ పాన్ యూనివర్సల్ కథలని లైన్ లో పెట్టి తమ బ్రాండ్ వేల్యూని ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో ఇప్పుడు అల్లు అర్జున్ కూడా అదే దిశగా తన జర్నీని కొనసాగిస్తున్నాడు. పుష్ప2 మూవీ ఈ ఏడాదిలోనే షూటింగ్ పూర్తి చేసుకొని వచ్చే వేసవిలో విడుదల కాబోతుంది.

ఏజంట్ డైరెక్టర్

ఏజంట్ డైరెక్టర్

ఇక పుష్ప 2 సినిమా రిలీజ్ లోపే ఇద్దరు దర్శకులని లైన్ లో పెట్టారు. రేసుగుర్రం లాంటి సూపర్ సక్సెస్ ఇచ్చిన సురేందర్ రెడ్డితో బన్నీ తన 22వ సినిమా చేయాలని అనుకుంటున్నాడు. ఏజెంట్ మూవీ రిలీజ్ అయిన వెంటనే సురేందర్ దానిపై దృష్టి పెడతాడు. అసలైతే సురేందర్ మొదట పవన్ తో చేయాలని అనుకున్నాడు. కాని ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది.

 సురేందర్ రెడ్డి కథ నచ్చకుంటే..

సురేందర్ రెడ్డి కథ నచ్చకుంటే..

అయితే అల్లు అర్జున్ కోసం అయినా కూడా ఇంకా సురేందర్ రెడ్డి పూర్తి స్థాయిలో కథను ఫైనల్ చేయలేదు. ఏజెంట్ గ్రాండ్ గా హిట్టయిన తరువాత అనుకున్న స్థాయిలో కథని సురేందర్ రెడ్డి అందించకపోతే మళ్ళీ బన్నీ వెనుకడుగు వేయవచ్చు. ఇక అది సెట్టవ్వకుంటే వెంటనే త్రివిక్రమ్ తో సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్ళడానికి సిద్ధం అవుతున్నాడు.

సందీప్ రెడ్డి దర్శకత్వంలో

సందీప్ రెడ్డి దర్శకత్వంలో

ఇక త్రివిక్రమ్ లేదా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మూవీ కంప్లీట్ చేసిన వెంటనే 23వ చిత్రంగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. టి-సిరీస్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో నిర్మించడానికి రెడీ అవుతుంది. అన్ని అనుకున్నట్లు సెట్ అయితే ఈ సినిమా వచ్చే ఏడాది ఆఖరులో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఒక వేళ కాకుంటే 2025 ఆరంభంలో సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది.

 మరో తమిళ దర్శకుడు

మరో తమిళ దర్శకుడు

ఇక ఈ మూవీ తర్వాత అల్లు అర్జున్ తన 24వ చిత్రాన్ని ఎఆర్ మురుగదాస్ తో గీతా ఆర్ట్స్ లో చేయడానికి ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ కాంబినేషన్ ఎప్పుడో సెట్ అయ్యింది. గతంలో గీతా ఆర్ట్స్ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసింది. ప్రస్తుతం మురుగదాస్ తమిళంలో పాన్ ఇండియా రేంజ్ లో శివ కార్తికేయన్ తో సినిమా చేయనున్నాడు. అది పూర్తయిన తర్వాత అల్లు అర్జున్ తో సినిమా స్టార్ట్ చేసే ఛాన్స్ ఉందనే మాట ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X