Allu Arjun: బేబీకి అల్లు అర్జున్ అదిరిపోయే గిఫ్ట్.. నేరుగా ఇంటికే పంపాడట, ఎందుకంటే?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోగా దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోగా కొనసాగుతున్నాడు. అయితే ఈయన తాజాగా టాలీవుడ్ లోని క్యూట్ హీరోయిన్ వైష్ణవి చైతన్యకు స్పెషల్ గిఫ్టు ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట ఫుల్ వైరల్ గా మారింది. అయితే అసలు అల్లు అర్జున్ అంత స్పెషల్ గిఫ్టు వైష్ణవి చైతన్యకు ఎందుకు ఇచ్చాడనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
బేబీ సినిమాతో హీరోయిన్ గా తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన సూపర్ క్యూట్ హీరోయిన్ వైష్ణవి చైతన్య అందరికీ తెలిసిన అమ్మాయే. అల వైకుంటపురంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు చెల్లెలిగా కనిపించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ టక్ జగదీష్, రంగ్ దే, వరుడు కావలెను, వలిమై, ప్రేమ దేశం వంటి చిత్రాలను నటించి మెప్పించింది. అలాగే అద్భుతమైన షార్ట్ ఫిల్మ్ లో చేస్తూనే తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంది. ఇక బేబీ చిత్రంతో అద్భుతమైన నటనను కనబర్చిన ఈమె ప్రస్తుతం వరుస చిత్రాల్లో ఆఫర్లు దక్కించుకుంటోంది.

ముఖ్యంగా మొదటి సినిమా బేబీతో సూపర్ డూపర్ హిట్టు కొట్టిన ఈమె... చాలానే సినిమాల్లో ఛాన్సులు కొట్టేసిందని తెలుస్తోంది. మరో రెండు, మూడేళ్ల వరకూ ఈ చిత్రాలతోనే ఫుల్ బిజీగా ఉండబోతున్నట్లు టాక్ నడుస్తోంది. అలాగే ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా కొనసాగుతున్న క్యూట్ బ్యూటీ శ్రీలీలకు గట్టి పోటీ ఇస్తుందని.. ఆమెను మించిన హీరోయిన్ గా కచ్చితంగా ట్రెండ్ చేస్తుందని కూడా సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే సిద్దు జొన్నలగడ్డతో ఓ సినిమా, ఆనంద్ దేవరకొండతో మరో సినిమా చాన్స్ కొట్టేసిందని సమాచారం.
అంతేకాకుండా ఆశీష్ రెడ్డితో కూడా వైష్ణవి చైతన్య ఓ సినిమా చేస్తోంది. ఈ సినిమాకు లవ్ మీ టైటిల్ ఖరారు చేయగా.. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా ప్రారంభం అయింది. వీరిద్దరితో కాకుండా మరికొంత మందితో కూడా సినిమాలు చేస్తుందని.. అయితే ఈ చిత్రాలన్నీ చర్చల దశలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇదంతా ఇలా ఉండగా.. ప్రస్తుతం వైష్ణవి చైతన్యకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓ స్పెషల్ గిఫ్టు పంపించారట. ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది. ఏకంగా 20 లక్షల రూపాయల చెక్ పంపినట్లు తెలుస్తోంది.

అయితే అల్లు అర్జున్ ఇన్ పుట్స్ తో త్వరలో ఆయన సొంత బ్యానర్ గీతా ఆర్ట్స్ లో వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రలో ఓ సినిమా చేయబోతుందట. ఈక్రమంలోనే అడ్వాన్స్ రూపంలో 20 లక్షల రూపాయల చెక్ ను ఇచ్చారట. ఏకంగా అల్లు అర్జున్ యే నేరుగా చెక్ పంపడంతో వైష్ణవి చైతన్య ఫుల్ ఖుషీ అయినట్లు సమాచారం. చూడాలి మరి ఇందులో ఎంత నిజం ఉంది అనేది. మరికొన్నాళ్లు గడిస్తే తప్పు పూర్తి వివరాలు తెలయవు.


Click it and Unblock the Notifications











