Pushpa 2 టెన్షన్‌లో సుకుమార్, అల్లు అర్జున్? జగదీష్‌ అరెస్ట్‌‌తో పుష్ప 2 పరిస్థితి ఏంటో?

ఫుష్ప ఫేమ్ జగదీష్ మహిళ హత్య కేసులో అరెస్ట్ కావడంతో హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్, చిత్ర యూనిట్ తీవ్రమైన సమస్యలో ఇరుక్కుపోయారు. అయితే జగదీష్ అరెస్ట్ కారణంగా షూటింగ్ నిలిచిపోయే అవకాశం ఉందనే విషయం మీడియాలో ప్రచారం జరుగుతున్నది. అయితే పుష్ప యూనిట్ ఎదుర్కోబోయే సమస్యల విషయాల్లోకి వెళితే..

యాక్టర్ జగదీష్‌కు కాకినాడకు చెందిన వివాహితతో అక్రమ సంబంధం ఉంది. అయితే వారి మధ్య రిలేషన్ కొద్ది సంవత్సరాలు సాగిన తర్వాత వారిద్దరి మధ్య విభేదాలు నెలకొన్నాయి. ఆ తర్వాత జగదీష్ మరో వివాహం చేసుకోగా, కాకినాడ మహిళ మరో వ్యక్తితో సంబంధం పెట్టుకొన్నది అని పోలీసులు తెలిపారు.

Jagadeesh Arrest

అయితే కొద్ది నెలల గ్యాప్ తర్వాత మళ్లీ కాకినాడ మహిళతో సంబంధం పెట్టుకొనేందుకు ప్రయత్నించాడు. అయితే అప్పటికే మరో వ్యక్తితో సంబంధం ఉండటం కారణంగా జగదీష్‌ను దూరం పెట్టింది. దాంతో తనను దూరం పెట్టడంతో జగదీష్ పగను పెంచుకొన్నారు. ఆ తర్వాత దొంగచాటుగా ఆమెను అర్ధనగ్నంగా ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేశాడు అని మీడియాలో కథనాలు వచ్చాయి.

ఇదిలా ఉండగా, జగదీష్ బ్లాక్ మెయిల్ పెరిగిపోవడంతోపాటు తన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరించడంతో భయపడిన ఆమె నవంబర్ 27వ తేదీన సూసైడ్ చేసుకోన్నది. ఆ మరణం వెనుక కారణాలను అన్వేషించిన తర్వాత జగదీష్ వ్యవహారం బయటపడటంతో అతడిని అరెస్ట్ చేశారు.

జగదీష్ అరెస్ట్‌తో పుష్ప యూనిట్‌లో కలకలం రేగింది. అల్లు అర్జున్ నటించే సీన్లలో జగదీష్ కీలకంగా మారడంతో ఆలోచనల్లో పడ్డారు. పుష్ప 2 సినిమాలో జగదీష్‌ పాత్ర ఎక్కువగా ఉండటం, అంతేకాకుండా షూట్ చేయాల్సిన సీన్లు కూడా చాలా ఉండటంతో పరిస్థితిని ఎలా డీల్ చేయాలనే విషయంపై దర్శకుడు సుకుమార్, అల్లు అర్జున్ మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలిసింది.

అయితే జగదీష్ అరెస్ట్ తర్వాత చోటు చేసుకొన్న సమస్యలను పరిష్కరించుకొనేందుకు సుకుమార్ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. కథలో ఏదైనా మార్పు చేయడమా? లేదా జగదీష్ బెయిల్‌పై వచ్చే వరకు వేచి చూడటమా? అనే ఆప్షన్లపై ఆలోచిస్తున్నట్టు తెలిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X