అంతా RRR చేతుల్లోనే ఉంది.. ఆ ఒక్క డేట్ కోసం పోటీగా నాలుగు సినిమాలు!

టాలీవుడ్ లో మళ్ళీ రిలీజ్ డేట్స్ పై కన్ఫ్యూజన్ మొదలైంది. గత ఏడాది నుంచి రిలీజ్ డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నిర్మాతలు ఈసారి కొంచెం పరిస్థితులు అదుపులోకి వచ్చినా వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. ఇక అందరి చూపు ప్రస్తుతం RRR నిర్ణయంపైనే ఉంది. ఈ ఒక్క సినిమా గనక పోటీ నుంచి తప్పుకుంటే మాత్రం మరో మూడు పెద్ద సినిమాలు పోటీకి దిగుతాయి.

RRR సినిమా అక్టోబర్ 13న వస్తుందని అభిమానులను నమ్మిస్తున్న రాజమౌళి ఎప్పుడు ఎలాంటి ట్విస్ట్ ఇస్తాడో తెలియదు. పరిస్థితులు కూడా అదుపులో లేకపోతే మాత్రం ఎవరు కూడా ఏమి చేయలేరు. ఆ సంగతి అటుంచితే RRR తప్పుకుంటే మాత్రం ఆ డేట్ కు మెగాస్టార్ చిరంజీవి ఆచార్య రావచ్చని టాక్ అయితే వస్తోంది. అలాగే పుష్ప 1 డిసెంబర్ ను టార్గెట్ చేసినప్పటికీ కూడా దసరా టైమ్ లో రావచ్చని అంటున్నారు. మెగాస్టార్ , అల్లు అర్జున్ మధ్య పోటీ అంటే చర్చలు జరిగే అవకాశం లేకపోలేదు. ఇక రెబల్ స్టార్ మాత్రం షాక్ ఇచ్చే ఛాన్స్ ఉంది.

If RRR plans changes Tollywood Big movies targets on October

రాధేశ్యామ్ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చేసింది. దీంతో డార్లింగ్ కూడా దసరా సమయంలో రావాలని అనుకుంటున్నాడు. ఇక వీరికంటే ముందు వినాయకచవితికి బాలకృష్ణ అఖండ రావచ్చని సమాచారం. ఏదేమైనా RRR రాకపోతే మాత్రం ఆచార్య, పుష్ప, రాధేశ్యామ్ సినిమాల్లో రెండు అయితే తప్పకుండా దసరా సమయంలో రావచ్చని తెలుస్తోంది. ఒకవేళ అప్పుడు సెట్టవ్వలేదు అంటే డిసెంబర్, పొంగల్ ఫెస్టివల్స్ పై ఫోకస్ పెట్టక తప్పదు. పుష్ప అయితే డిసెంబర్ ను సైతం ఒక టార్గెట్ గా సెట్ చేసుకుంది. మరి ఫైనల్ గా ఏ సినిమా ఎప్పుడు వస్తుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X