Pawan Kalyan ఈసారి రాజకీయాల్లో కింగ్ మేకర్... ఆ సెంటిమెంట్ వర్కౌటైతే?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అటు సినిమాల్లో నటిస్తూ... ఇటు రాజకీయాల్లోనూ బిజి బిజిగా గడుపుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి పవన్ కల్యాణ్ కింగ్ మేకర్ అవుతారంటూ నెట్టింట ట్రెండింగ్ అవుతుంది. దానికి కారణం ఆయన ధరించిన ఉంగారాలు. మొన్న ప్రెస్ పెట్టిన పవన్.. తన చేతికి ఉన్న ఉంగారాలు అందరినీ ఆకర్షించాయి. ఇక వాటి గురించి లోతుగా తెలుసుకున్న నెటిజన్స్... పవన్ ఈ సారి పక్కా రాజకీయాల్లో కింగ్ మేకర్ కానున్నారంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే....

పవర్ స్టార్ పవన్ కల్యాణ్... ప్రస్తుతం రాజకీయాల్లో బిజిగా ఉన్నారు. ఇక ఆయన మొన్న బాలయ్య బాబు, లోకేష్ తో కలిసి చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలులో కలిశారు. ఆయనకు దైర్యం చెప్పి.. అనంతరం ప్రెస్ మీట్ పెట్టిన విషయం తెలిసిందే. ఇక ఈ సారి ఎన్నికల్లో పవన్ కల్యాణ్ టీడీపీతో కలిసి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు పవన్ చేతికి ఉన్న ఉంగారాలు అందరినీ ఆకర్షించాయి.

If That Sentiment Works Out, Pawan Kalyan is the King Maker in Politics This Time News Goes Viral

ఇక పవన్ కల్యాణ్ ధరించిన రెండు ఉంగారాలు.... ఒకటి నాగ బంధం, రెండోది కూర్మం అని తెలుస్తోంది. ప్రతి ఒక్కరికి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. ముఖ్యంగా సినీ, రాజకీయ నాయకులు వీటిని నమ్ముతూ ఉంటారు. చంద్రబాబు ఒకే డ్రెస్ కోడ్ కానివ్వండి.. అంతకు ముందు ఎన్టీఆర్ కూడా కొన్ని ఉంగారాలు, డ్రెస్ కోడ్.. ఇవన్నీ సెంటిమెంట్ దృశ్యా ధరిస్తారని తెలుస్తోంది.

ఇక పవన్ కల్యాణ్ సైతం... తన చేతికి ఉంగారాలు ధరించడం కూడా ఓ సెంటిమెంట్ అని తెలుస్తోంది. నాగ బంధం, కూర్మం పెద్ద ఉంగరాలు ధరించడం వెనుక ఓ పెద్ద ప్లాన్ ఉందని అంటున్నారు నెటిజన్స్. పవన్ కుడి చేతి వేళ్లకు ఉన్న ఈ రెండు ప్రత్యక ఉంగరాలు ... రాజకీయాల్లో అనుకూల ఫలితాలు ఇస్తాయని సమాచారం. అందుకే వీటిని ధరిస్తారని కొంతమంది చెప్పుకు వస్తున్నారు. వీటితో పాటు మంగళ వారం, శని వారం సమయంలో కూడా పగడం ధరిస్తే... మంచి జరుగుతుందట.

If That Sentiment Works Out, Pawan Kalyan is the King Maker in Politics This Time News Goes Viral

అయితే ముఖ్యంగా జాతక రిత్యా తాబేలు ఉంగరాన్ని (కుర్మా ఉంగరం) ధరిస్తే.. అధికార యోగంతో పాటు ధన యోగం ఇస్తుందని అంటున్నారు. ఇవి ఉంటె అన్ని విజయాలు తమవెంటే ఉంటాయని నమ్మకం. వచ్చే ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్‌లో ఈయన కింగ్ లేదా కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఉందాని పండితులు చెప్తున్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో పవన్ కింగ్ మేకర్ అని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు. ఈ సెంటిమెంట్ వర్కౌట్ అయితే మాత్రం ఇక వీటికి బలాన్ని చేకూర్చినట్లు అవుతుంది.

If That Sentiment Works Out, Pawan Kalyan is the King Maker in Politics This Time News Goes Viral

ఇక ఈ కుర్మ ఉంగరం అందరికీ కలిసిరాదని... కొన్ని ప్రత్యేక రాశుల వారికే మాత్రమే కలిసి వస్తుందని అంటున్నారు జోతిష్యులు. ఇవి పెట్టుకున్న వారికి ఇబ్బందులు తొలగిపోయి విజయాలు సాదిస్తారని అంటున్నారు. జోతిష్యల సలహా మేరకే పవన్ కల్యాణ్ ఈ ఉంగరాలు ధరించారని చెప్పుకుంటున్నారు. రాబోయే ఎన్నికల్లో విజయం కోసం పవన్ కల్యాణ్ ఏ ఒక్క అవకాశాన్ని వదులు కోవడంలేదని అర్ధం అవుతుంది. ఇక వచ్చే ఎన్నికల్లో పవన్ కింగ్ మేకర్ అవుతారో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X