'వాహ్ ....నమితా!' అంటున్న ఇళయరాజా....

అసలు యేం జరిగిందిని కొందరు ఎంక్వైరీ కమీషన్లు వేసి ఆరా తీస్తే తేలిందేమిటంటే నమిత ప్రస్తుతం 'జగన్మోహిని' చిత్రంలో చేస్తోంది కదా. దానికి ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. జయమాలిని ఆ రోజుల్లో చేసిన ఆ పాత్ర నమిత చేస్తోంది. అసలే ఆ పాత్ర కొంత సెక్సీ లుక్స్ తో ఉంటుంది. అందులోనూ నమిత చేస్తూండటంతో అది మరింత స్పైసీ గా తయారైంది. అనుకోకండా ఆ షూటింగ్ కి ఇళయరాజా అటెండ్ అయ్యారట.
సరిగ్గా అప్పుడే సాంగ్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్నారట. దాంతో రియల్ గా ఆమె భారి అందాలు ఆ సాంగ్ లో చూడటం ఆయన ఎంజాయ్ చేయటం జర్గిందిట. అంతేగాక ఆ పాట పూర్తయ్యే దాకా ఆగి ఆమెను వాహ్ నమితా అనే అర్ధం వచ్చేలా తమిళంలో మెచ్చుకున్నారుట. ఆమె ఆనందం పట్టలేక పోవటం జరిగిందిట. ఈ సన్నివేశం మొత్తం అక్కడున్న అందరి కళ్ళల్లో పడి అలా...అలా ప్రయాణం ప్రారంభించిందిట. నమితా ఇదంతా యేమిటంటే ...ఓ కళాకారుడు ...స్పందన అంటూ గొప్పలు పోతోందిట. అదీ నమితా...ఇళయరాజా కథ.


Click it and Unblock the Notifications











