'నేను నా రాక్షసి' చిత్రంలో ఇలియానా క్యారెక్టర్ సీక్రెట్ లీకయింది
త్వరలో విడుదలకానున్న నేనూ...నా రాక్షసి చిత్రంలో ఇలియానా ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.అయితే ఇలియానా మాత్రం విషయాన్ని రివిల్ చేయటం లేదు.ఆమె తన క్యారెక్టర్ గురించి చెపుతూ...
ఇంతకు ముందు'రాఖీ' సినిమాలో మంచి పాత్ర లభించింది.ఇప్పుడీ రాక్షసి క్యారెక్టర్ కూడా అలాంటిదే అంటూ దాటేస్తోంది. అలాగే ...'నేను నా రాక్షసి'సినిమాలో నా పాత్రలో కొంతవరకు నన్ను నేను తరిచి చూసుకున్నా. నిజ జీవితానికి దగ్గరగా ఉండే కథనం.చాలా స్ట్రాంగ్ వుమెన్ రోల్ ఇది. తెలివైన అమ్మాయి.ఈ మధ్య కాలంలో నాకు బాగా నచ్చిన సినిమా ఇది అంది.మొదట్లో 'రాక్షసి' ఏమిటి? అనుకున్నాను. షూటింగ్ చేస్తున్న కొద్దీ క్యారెక్టర్‌లో వున్న డెప్త్ తెలిసి, ఆ పాత్ర అంటే తెలియని ఇష్టం ఏర్పడింది అంది.
ప్రస్తుతం ఇలియానా..రానాతో నేనూ నా రాక్షసి, పవన్ కళ్యాణ్‌తో ఓ సినిమా, మహేష్‌బాబుతో మరో సినిమా, ప్రభాస్‌తో ఓ సినిమా చేస్తోంది. రెమ్యునేషన్ కూడా పెంచిన ఈ భామ టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. త్వరలో బాలీవుడ్ లో కూడా ప్రవేశించి హిట్స్ కొడతానని నమ్మకంగా చెప్తోంది.


Click it and Unblock the Notifications











