'పోకిరి' కాంబినేషన్ మహేష్, ఇలియానా మళ్ళీ
పోకిరి వంటి మెగా హిట్ ఇచ్చిన హాట్ పెయిర్ మహేష్ బాబు,ఇలియానా మళ్లీ కలిసి ఓ చిత్రం చేయబోతున్నారు. ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందే త్రి ఇడియట్స్ రీమేక్ కోసం ఈ ఎంపిక జరిగింది. తమిళంలో విజయ్, తెలుగులో మహేష్ బాబు చేస్తున్న అమీర్ ఖాన్ పాత్రకు జంటగా రెండు బాషలకూ కలపి ఇలియానాను బుక్ చేసారు. మొదట త్రిషను ఆ పాత్రకు తీసుకుందామనుకున్నారు కానీ ఆమె హిందీలో వరసగా చిత్రాలు ఒప్పుకునే ప్రయత్నాల్లో ఉందని తెలిసి ఇలియానాను తీసుకున్నారు. హిందీలో కరీనా కపూర్ చేసిన ఆ పాత్ర ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ కూతురుగా కామిడీగా రన్ అవుతూంటుంది.అలాగే కథకు కీలకమైనడుస్తుంది. ఇక మాధవన్ తను త్రి ఇడియట్స్ లో చేసిన పాత్రను ఉన్నదున్నట్లుగా చేస్తున్నాడు.అలాగే ఇలియానా ప్రస్తుతం ఎన్టీఆర్ సరసన శక్తి చిత్రంలో చేస్తోంది. తమిళంలో విక్రమ్ సరసన వేడి అనే సినిమాలోనూ చేస్తోంది. శంకర్ రజనీకాంత్ తో చేస్తున్న రోబో రిలీజ్ అనంతరం ఈ చిత్రం ప్రారంభం ఉంటుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











