పవన్ కళ్యాణ్ తో మరోసారి ఇలియానా

By Srikanya

జల్సా చిత్రంలో అదరకొట్టిన ఇలియానా,పవన్ కళ్యాణ్ కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుంది. రెండు రోజుల క్రితం వరకూ దీపికా పడుక్కోని ని సీన్ లోకి తెస్తానన్న జయంత్ పరాంన్జీ చేతులు ఎత్తేసి ఇలియానాని ఆహ్వానించాడు. జల్సాలో ఆమెతో చేసి ఉండటంతో పవన్ కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చేసారు. ప్రస్తుతం ఎన్టీఆర్ శక్తి చిత్రంలో చేస్తున్న ఇలియానాకి తెలుగులో ఏ చిత్రమూ లేదు. అనూష్క వచ్చి మొత్తం ఆఫర్స్ అన్నీ కొట్టుకెళ్ళిపోతోంది. ఈ నేపధ్యంలో ఇలియానా ఈ చిత్రం ఆఫర్ రావటంతో ఎగిరిగంతేసినంత పనిచేసింది. ఇక ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ రెండు పాత్రల్లో కనిపిస్తారు. మొదటి పాత్రకు అనూష్క ని తీసుకున్నారని చెప్తున్నారు. అయితే అందులో కూడా మార్పులు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. త్రివక్రమ్ డైలాగులు రాస్తున్న ఈ చిత్రం షూటింగ్ జూన్ ఒకటి నుంచి ప్రారంభం కానుంది. గణేష్ బాబు నిర్మిస్తున్నఈ చిత్రం యుయుస్ లో షూటింగ్ జరగనుంది. అందుకోసం ప్రస్తుతం ఏర్పాట్లు జరుగుతున్నాయి. బిందు ప్రధాన్ ఈ చిత్రానికి కెమెరామెన్ గా పనిచేస్తున్నారు. హిందీలో 'లవ్ ఆజ్ కల్" చిత్రంలో సైఫ్ ఆలీ ఖాన్, దీపిక పదుకొనే నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X