ఇలియానా..ఆల్టర్ నేటివ్ హిట్
సెక్సీ స్టార్ ఇలియానా కెరీర్ గ్రాఫ్ ని పరిశీలించిన కొందరు ఆమెకు ఆల్టర్ నేటివ్ హిట్ సెంటిమెంట్ గా మారిందని తేలుస్తున్నారు. పవన్ కళ్యాణ్ తో చేసిన జల్సా హిట్టయిన తర్వాత తరుణ్ తో చేసిన భలే దొంగలు పెద్ద ప్లాప్. అలాగే ఆ తర్వాత చేసిన కిక్ చిత్రం పెద్ద హిట్టయింది. ఆ వెంటనే నితిన్ సరసన చేసిన రెచ్చిపో ఎడ్రస్ లేకుండా పోయింది. దాంతో ఇప్పుడు ఆమె చేయబోయే సినిమా గ్యారెంటీ హిట్ అని తేల్చారు. కానీ ఆ తర్వాత మళ్ళీ కథ మొదలుకొచ్చి సెంటమెంట్ ప్రకారం ఫ్లాఫ్ అవుతుందంటున్నారు. సెంటిమెంట్ వినటానికి బావున్నా దాన్ని పట్టుకుని ప్లాన్ చేయటం కష్టం అంటున్నారు ఆమె డేట్స్ కోసం తిరుగుతున్నవాళ్ళు. ఎందుకంటే ఆమె డేట్స్ దొరకటమే మహాభాగ్యంగా ఉంటే నాకు ఫలానా టైమ్ లోనే కావాలనటం ఈ బిజెనెస్ లో జరిగేపని కాదంటున్నారు. ఇక ఆమె శ్రేయాభిలాషులైతే అటువంటి సెంటమెంటేమీ లేదని యాధృచ్చికంగా అలా జరిగిందని పట్టించుకోవాల్సిన పనిలేదని శెలవిస్తున్నారు.


Click it and Unblock the Notifications











