ఇలియానా, ఆమె బాయ్‌ఫ్రెండును కలిపిన దర్శకుడు!
హైదరాబాద్: గోవా సుందరి ఇలియానా గతకొంత కాలంగా ఆస్ట్రేలియన్ బాయ్‌ఫ్రెండ్ ఆండ్రూ నీబోన్‌తో లవ్‌ఎఫైర్ కొనసాగిస్తున్నట్లుగా బాలీవుడ్ రకరకాల కథనాలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా అతడు ఇలియానా నటిస్తున్న బాలీవుడ్ మూవీ 'హ్యాపీ ఎండింగ్' సినిమాలో ఆమెతో పాటు నటిస్తున్నాడట.
రాజ్ నిడిమోరు, కృష్ణ డీకే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఈ సినిమా షూటింగ్ లాస్ ఏంజిల్స్‌లో జరుగుతూ ఉండగా ఆండ్రూ తరచూ షూటింగ్ స్పాట్ కు వస్తూ ఉండేవాడట. ఇలియానా బాయ్ ఫ్రెండ్ కావడంతో యూనిట్ సభ్యులకు దగ్గరయ్యాడు. అదే సమయంలో సినిమాలోని ఓ పాత్రకు విదేశీ నటుడు అవవసరం కావడం...ఆండ్రూ అందుకు సరిపోయే విధంగా ఉండటంతో అతన్నే తీసుకున్నారట.

ఆండ్రూ ఆస్ట్రేలియాకు చెందిన ప్రొఫెషనల్ ఫోటో గ్రాఫర్. ఇలియానా-ఆండ్రూ మధ్య దాదాపు రెండేళ్లుగా పరిచయం ఉందని, వాళ్ల క్లోజ్ నెస్ చూస్తుంటే కేవలం స్నేహం మాత్రమే కాదని....అంతకు మించిన అనుబంధం వారి మధ్య ఉందనే వార్తలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి.
రెండేళ్ల క్రితం క్రితం ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా వీరి మధ్య పరిచయం ఏర్పడిందని, అప్పటి నుంచి ఇద్దరి మధ్య రిలేషన్ బాగా పెరిగిందని, ఇరువురు ఒకరి అభిప్రాయాల ఒకరు బాగా తెలుసుకోవడంతో పాటు అర్థం చేసుకుంటున్నారని అంటున్నారు. అంతే కాదండోయ్...ఆ మధ్య ఒకసారి ఇలియానా అతన్ని తన ఇంటికి లంచ్‌కి ఇన్వైట్ చేసి తన పేరెంట్స్‌కి పరిచయం కూడా చేసిందట.


Click it and Unblock the Notifications











