»   » అల్లు అర్జున్ కే కాలం కలిసిరావడంలేదు దానికి తోడు ఐరెన్ లెగ్గా...!

అల్లు అర్జున్ కే కాలం కలిసిరావడంలేదు దానికి తోడు ఐరెన్ లెగ్గా...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

అప్పట్లో పోకిరి, జల్సాలాంటి హిట్ సినిమాల్లో నటించి ఉండొచ్చుగాక, పాత హిట్లు పేరు చెప్పుకుని ఎప్పటికీ అవకాశాలు దక్కించుకోవడం కష్టం కాబట్టి ప్లాపుల్లో ఉన్న ఇలియానా విమర్శలు తట్టుకోక తప్పదిక. వరుసగా నాలుగు ప్లాపుల్లో నటించడం వల్ల ఇలియానాని ఇప్పుడు నిర్థాక్షిణ్యంగా ఐరెన్ లెగ్ అనేస్తున్నారు. దాంతో ఒకప్పుడు ఆమెతో నటించాలని సరదా పడిన వాళ్లే ఇప్పుడు రిస్కొద్దని తప్పుకుంటున్నారు.

ఇలియానాకి ఇప్పుడు సెట్స్ మీదున్న తెలుగు చిత్రం ఏదీ లేదు. అయితే అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కే సినిమాలో మాత్రం ఆమెని తీసుకోవాలని అనుకుంటున్నారు. అడ్వాన్స్ కూడా చెల్లించేశారు. కానీ ప్రస్తుతం ఇలియానా వల్ల సినిమాకి యాడ్ అయ్యేది లేకపోగా మైనస్ అయ్యే ప్రమాదం పొంచి ఉండడంతో ఆమెకి కోటికి పైగా చెల్లించి సినిమాలో పెట్టుకోవడం అవసరమా అని ఆలోచిస్తున్నారు.

ఇటీవల అల్లు అర్జున్ కే కాలం కలిసి రావడం లేదు. గతంలో ఎన్నడూ లేనట్టుగా అతడిని వరుస పరాజయాలు వేధిస్తున్నాయి. ఈ తరుణంలో ఇలియానాతో కంటే ఫామ్ లో ఉన్న మరో హీరోయిన్ తో చేస్తే బెటరని అతను భావించినా ఆశ్చర్యంలేదు. ప్రస్తుతం ఈ సినిమా గురించి అలాంటి సంకేతాలే అందుతున్నాయి. అఫిషియల్ న్యూస్ కోసం వెయిట్ చేయండి..

English summary
Ileana is in danger of getting sacked from Tollywood with back-to-back duds 'Shakti' and 'Nenu Naa Rakshasi'. She has just one Telugu film on her hands at the moment. She is supposed to play the female lead in Allu Arjun – Trivikram movie. But the buzz in film nagar says that Allu Arjun and Trivikram are seriously considering a replacement to Ileana.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu