»   » టాలీవుడ్ హీరోతో ఆరేళ్లు డేటింగ్ చేశా.. నా స్వార్థం కోసమే.. ఇలియానా

టాలీవుడ్ హీరోతో ఆరేళ్లు డేటింగ్ చేశా.. నా స్వార్థం కోసమే.. ఇలియానా

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ వెండితెర మీద ఓ శృంగార దేవతగా ఓ వెలుగు వెలిగిన ఇలియానా ఆర్పేసిన దీపంలా మారిపోయింది. ఎప్పుడు నాలుగైదు సినిమాలతో తెలుగు పరిశ్రమలో హడావిడి చేసే ఇలియానా బాలీవుడ్‌కు తరలిపోయింది. హిందీ పరిశ్రమలో ఒకట్రెండు సినిమాల్లో బాగానే మెరిసింది. అయితే హిందీలో ఏక్ సే ఏక్ హీరోయిన్లు ఉండటంతో అనుకున్నంతగా ఇలియానా రాణించలేకపోయింది. ప్రస్తుతం అడపాదడపా సినిమాల్లో కనిపిస్తున్న ఇలియానా ప్రస్తుతం ఆస్ట్రేలియా ఫొటోగ్రాఫర్‌తో డేటింగ్ చేస్తున్నది. దశాబ్దకాలానికి పైగా టాలీవుడ్‌లో రాణించిన ఇలియానా ఓ తెలుగు హీరోతో డేటింగ్ చేశానని ఇలియానా వెల్లడించి ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది.

ఆ సమస్య కారణంగానే డేటింగ్

ఆ సమస్య కారణంగానే డేటింగ్

తన ఆరోగ్యం మెరుగ్గా ఉండేందుకు ఓ టాలీవుడ్ హీరోతో డేటింగ్ చేశాను. నాకు యవ్వనంలో హార్మోన్ల సమస్య తలెత్తింది. దాంతో ఓ తెలుగు హీరోతో అఫైర్ కొనసాగించాను. మా ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తడంతో విడిపోయాను అని గోవా సుందరి ఇటీవల మీడియాకు చెప్పేసింది. అయితే ఆ హీరో పేరు చెప్పడానికి నిరాకరించింది.

Ileana's hot Secrets When She is Alone
టాలెంట్ ఉంటే దేనికి లొంగనవసరం లేదు

టాలెంట్ ఉంటే దేనికి లొంగనవసరం లేదు

పాత్రల కోసం పడకగదికి చేరుకోవడం ( కాస్టింగ్‌ కౌచ్‌) అనేది హీరోయిన్ల మనస్తత్వంపై ఆధారపడి ఉంటుంది. తమ టాలెంట్‌పై నమ్మకం ఉండేవారు అలాంటి వాటికి లొంగరు. ప్రతిభ ఉంటే మనవెంటనే పడుతారు. ఆ వ్యవహారం మన మనస్తత్వంపైనే ఆధారపడి ఉంటుంది అని ఇలియానా వెల్లడించింది.

అమెరికాకు వెళ్లడానికే దేవదాస్‌లో..

అమెరికాకు వెళ్లడానికే దేవదాస్‌లో..

15 ఏళ్ల వయసులోనే ఓ తెలుగు సినిమాతో కెరీర్‌ మొదలుపెట్టాను. నాకు భాష రాదని చెప్పినా వారు నన్ను దేవదాస్ చిత్రంలోకి తీసుకొన్నారు. అమెరికాకు వెళ్లడానికి అవకాశం ఉండటంతో నేను ఒప్పుకొన్నాను. ఆ తర్వాత కొన్ని పరిస్థితుల కారణంగానే తెలుగు హీరోతో డేటింగ్ చేయాల్సి వచ్చింది. నా ఇష్టపూర్వకంగానే అది జరిగింది. దానిని క్యాస్టింగ్ కౌచ్ అనుకోవద్దు అని ఇలియానా చెప్పింది.

అండ్రూతో పీకల్లోతు ప్రేమలో

అండ్రూతో పీకల్లోతు ప్రేమలో

ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్‌ అండ్రూ నీబోన్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగిన ఇలియానా ప్రస్తుతం విదేశాలను చుట్టివస్తున్నది. పలు దేశాల్లో పర్యటిస్తూ సోషల్ మీడియాలో ఫొటోలు పోస్ట్ చేసి వేడి పుట్టిస్తున్నది. బాలీవుడ్ అవకాశాల కోసం హైదరాబాద్ నుంచి దుకాణం ఎత్తేసిన ఇలియానా గోవా టు ముంబై మధ్య చక్కర్లు కొడుతున్నది.

ముబాకరన్ చిత్రంలో అర్జున్ కపూర్‌తో

ముబాకరన్ చిత్రంలో అర్జున్ కపూర్‌తో

బాలీవుడ్‌లో ప్రస్తుతం ముబాకరన్, బాద్షాహో అనే చిత్రాల్లో నటిస్తున్నది. అర్జున్ కపూర్ హీరోగా నటిస్తున్న ముబాకరన్ చిత్ర షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతున్నది. ఈ చిత్రాలపైనే బోలెడు నమ్మకాన్ని పెట్టుకొన్నది.

English summary
Ileana dcruz is now busy with Mubakaran and Baadshah movies. She shooting with Arjun Kapoor for Mubakaran in London. She revealed that she had date with Tollywood actor for six years.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu