ఇలియానా డెసిషన్ అదేనా?.. తగ్గక తప్పదనే ఇలా చేస్తోందా?

దేవదాస్ సినిమాతో టాలీవుడ్ తెరకు కొత్త అందాల రుచి చూపించి వావ్! అనిపించింది గోవా బ్యూటీ ఇలియానా. ఆ తర్వాత వరుస ఆఫర్స్‌తో తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈమె.. వెంటనే రూటు మార్చేసి బాలీవుడ్ వైపు మొగ్గుచూపింది. బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించే అవకాశం రావడంతో అక్కడే సెటిలై తెలుగు సినిమాలకు కొంతకాలం దూరంగా ఉంది.

ఈ మధ్య కాలంలోనే విదేశీ ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్ తో డేటింగ్, ఆ తర్వాత బ్రేకప్ వెంటవెంటనే జరిగిపోయాయి. ఈ మేరకు తిరిగి కెరీర్ పై దృష్టి సారించిన ఈ గోవా బ్యూటీ బాలీవుడ్ సహా దక్షిణాది లోనూ మరోసారి సత్తా చాటాలని ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగం గానే ఇటీవలే రవితేజ సరసన 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమాలో నటించింది. అయితే ఈ సినిమా ఆశించిన ఫలితం రాబట్టకపోవడంతో అమ్మడికి సరైన రీ ఎంట్రీ దొరకలేదు.

 Ileana DCruz Once again preparing for Wait Loss..?

దీంతో తన అందాలకు మెరుగులు పెట్టే దిశగా డెసిషన్ తీసుకుందట ఇలియానా. ఈ మేరకు మరింత సన్నబడేందుకు గాను వ్యాయామాలు, డైట్ నియమాలు స్టార్ట్ చేసిందట. ఒకప్పుడు ఎలాగైతే నడుము అందాలతో మాయ చేసిందో ఇప్పుడు కూడా అదే ఫార్ములా అప్లై చేయాలని ఇలియానా భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు చిరంజీవి- కొరటాల శివ కాంబినేషన్ లో రాబోతున్న కొత్త సినిమాలో ఇలియానానే హీరోయిన్ గా కన్ఫర్మ్ అయిందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X