For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఇలియానా సీక్రెట్ ఎంగేజ్ మెంట్ (ఫొటో ఫీచర్)

  By Srikanya
  |

  చెన్నై : నటి ఇలియానాకు వివాహ నిశ్చితార్థం అయ్యిందని వార్తలు వస్తున్నాయి. ఆమె గత కొద్ది రోజులుగా ఆస్ట్రేలియాకు చెందిన బాయ్‌ఫ్రెండ్ ఆండ్రూతో జాలీగా షికార్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఇలియానాకు తన ప్రేమికుడు ఆండ్రూతో ఇటీవల వివాహనిశ్చితార్థం జరిగినట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఈ వేడుకను సీక్రెట్ గా నిర్వహించినట్లు సమాచారం.

  ఆండ్రూ ఆస్ట్రేలియాకు చెందిన ప్రొఫెషనల్ ఫోటో గ్రాఫర్. ఇలియానా-ఆండ్రూ మధ్య దాదాపు రెండేళ్లుగా పరిచయం ఉంది. రెండేళ్ల క్రితం క్రితం ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా వీరి మధ్య పరిచయం ఏర్పడింది.

  అప్పటి నుంచి ఇద్దరి మధ్య రిలేషన్ బాగా పెరిగిందని, ఇరువురు ఒకరి అభిప్రాయాల ఒకరు బాగా తెలుసుకోవడంతో పాటు అర్థం చేసుకుంటున్నారని అంటున్నారు. అంతే కాదండోయ్...ఆ మధ్య ఒకసారి ఇలియానా అతన్ని తన ఇంటికి లంచ్‌కి ఇన్వైట్ చేసి తన పేరెంట్స్‌కి పరిచయం కూడా చేసిందట.

  బాలీవుడ్ లో కెరీర్ పరాజయంతో ఇలియానా బిచానా ఎత్తేయాల్సిన పరిస్థితి. ఇలియానా మనసు కూడా పెళ్లి వైపు పరుగులు తీస్తోందని, అందకే వీలైనంత త్వరగా గుడ్‌బై చెప్పేసి జీవితంలో స్థిరపడిపోవాలన్న ప్రయత్నాల్లో ఉందని బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. దానికి తోడు ఫ్లాపులూ చుట్టిముట్టడంతో ఇక ఇలియానా తన జీవితంలో ఓ కీలకమైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైనట్టే కనిపిస్తోంది. మరి ఇలియానా ఏం చేస్తుందో చూడాలి.

  స్లైడ్ షోలో....మరిన్ని విశేషాలు..

  శృంగారం గురించి...

  శృంగారం గురించి...

  కొద్ది రోజుల క్రితం శృగారం గురించి కూడా ఆమె పెదవి విప్పింది. గోవా బ్యూటీ ఇలియానా మాత్రం పబ్లిగ్గానే శృంగారం గురించి తెగ లెక్చరర్స్ ఇస్తోంది.

  మొహమాటం లేకుండా..

  మొహమాటం లేకుండా..

  సిగ్గు, మొహమాటం లాంటివేవీ లేకుండా సెక్స్ మనిషికి చాలా అవసరం అని చెప్పిందట ఇల్లీ. ఇటీవలే ఓ హెల్త్ మేగజైన్‌కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఇలియానా సెక్స్ గురించి చాలా విషయాలే చెప్పినట్లు తెలుస్తోంది.

  ఇలియానా మాట్లాడుతూ...

  ఇలియానా మాట్లాడుతూ...

  మంచి హెల్త్‌కి సెక్స్ చాలా అవసరం. సెక్స్ వల్ల ఫిట్‌గా వుంటారు. అంతేకాకుండా మంచి ఆకృతితోపాటు ఉత్సాహాన్ని ఇస్తుందని చెప్పిందట.

  తక్కువే..

  తక్కువే..

  శృంగారం వల్ల ఆరోగ్యం, ఫిట్‌నెస్ బాగుంటాయని గతంలో చాలామందే చెప్పారు కానీ ఈ ఉత్సాహం గురించి చెప్పినవాళ్లు మాత్రం తక్కువే.

  చిరాకు..

  చిరాకు..

  అలాగే... ''ఇతరులపై ఆధారపడి జీవించడం అంటే నాకు పరమ చిరాకు. నా సంపాదనతో జీవించడంలో ఉన్న ఆనందం ఎందులోనూ ఉండదు'' అని చెప్పుకొచ్చింది.

  స్వతంత్రంగా నిర్ణయాలు

  స్వతంత్రంగా నిర్ణయాలు

  నా జీవితానికి సంబంధించిన నిర్ణయాలు నేనే తీసుకొంటాను. మనం స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటున్నామంటే జీవితంలో అభివృద్ధి దిశగా వెళుతున్నట్టే'' అని చెప్పుకొచ్చింది.

  చిన్న విరామం

  చిన్న విరామం

  బాలీవుడ్‌లో 'హ్యాపీ ఎండింగ్‌' చిత్రం తర్వాత నటి ఇలియానా మళ్లీ మరో సినిమా అంగీకరించలేదు. ప్రస్తుతం చిన్న విరామం తీసుకున్నానని త్వరలోనే మంచి పాత్రతో వస్తానని చెప్తున్నారామె.

  వేచి చూస్తున్నా

  వేచి చూస్తున్నా

  ఇటీవల వస్తున్న ఆఫర్లేవీ తనను అంతగా ఆకట్టుకోలేదని, మంచి పాత్రలకోసం వేచి చూస్తున్నానని ఆమె చెప్పారు.

  సమయం పడుతుంది

  సమయం పడుతుంది

  ప్రస్తుతం ఓ చిత్రం గురించి చర్చలు జరుగుతున్నాయని, ఆ పాత్ర తనకు నచ్చిందని, పూర్తి వివరాలు తెలియాలంటే మరి కాస్త సమయం పడుతుందని పేర్కొన్నారు.

  పట్టించుకోలేదు

  పట్టించుకోలేదు

  సాధారణంగా తెలుగు, తమిళం, హిందీ... అంటూ చక్కర్లు కొడుతుంటారు హీరోయిన్స్. 'అన్ని చోట్లా మన ముద్ర పడాల్సిందే' అని కష్టపడుతుంటారు. ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు వస్తాయో, ఓ చోట కాకపోతే మరోచోటైనా అవకాశాలు సంపాదించుకోవచ్చు కదా అనే ముందు జాగ్రత్త కూడా ఉంటుంది. అయితే ఇలియానా మాత్రం బాలీవుడ్‌ ఆఫర్‌ వచ్చాక దక్షిణాది చిత్రాల్ని అస్సలు పట్టించుకోలేదు.

  నిలదొక్కుకోలేదు

  నిలదొక్కుకోలేదు

  'జులాయి' తరవాత ఒక్క తెలుగు సినిమా కూడా ఒప్పుకోలేదు. 'బర్ఫీ'తో గుర్తింపు వచ్చినా... కమర్షియల్‌ హీరోయిన్ గా మాత్రం నిలదొక్కుకోలేకపోయింది.

  తన్నేసాయి

  తన్నేసాయి

  ఇప్పుడు 'హ్యాపీ ఎండింగ్‌' కూడా నిరాశ పరిచింది. అంతకు ముందు 'పటా పోస్టర్‌ నిక్లా హీరో', 'మై తేరా హీరో' చిత్రాలూ బాల్చీ తన్నేశాయి.

  కోలీవుడ్ లో ...

  కోలీవుడ్ లో ...

  కోలీవుడ్‌లోనూ చేసింది రెండు చిత్రాలే అయినా ఇక్కడి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు.తమిళంలో కేడీ చిత్రంతో పరిచయం అయిన ఇలియానా ఆ తరువాత విజయ్‌తో నన్బన్ చిత్రంలో నటించారు. ఆపై అవకాశాలు వచ్చినా అధిక పారితోషికం డిమాండ్ లాంటి ప్రచారం జరిగింది.

  ఇప్పుడు హాలీవుడ్ కు..

  ఇప్పుడు హాలీవుడ్ కు..

  ఇప్పుడామె హాలీవుడ్ కు కూడా ప్రయాణం కట్టబోతోందని వినికిడి. అందుతున్న సమాచారం ప్రకారం ఆమె జాకీఛాన్ సరసన...కుంగుఫూ యోగ చిత్రంలో నటించనుందని తెలుస్తోంది.

  English summary
  South and Bollywood actress Ileana D'Cuz is dating an Australian photographer Andrew Kneebone. The Goan beauty has never tried to hide her relationship. The latest buzz on her affair is whether she has secretly engaged to her beau.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X