హాట్ టాపిక్: పవన్ సినిమాని ఇలియానా రిజెక్టు
పవన్ కళ్యాణ్, ఇలియానా కాంబినేషన్ లో గతంలో జల్సా చిత్రం వచ్చి సూపర్ హిట్టైన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే ఇలియానాని పవన్ తాజా చిత్రం గబ్బర్ సింగ్ లో ఐటం సాంగ్ కు అడిగారు. అయితే ఆమె నిర్విర్దంగా నో చెప్పేసింది. హిందీలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన మున్నీ కా బద్నమ్ సాంగ్ కి ఇక్కడ డాన్స్ చేస్తే తనకూ ఐటం గర్ల్ లుక్ వస్తుందని భయపడి నో చెప్పిందని సమాచారం. అప్పటికీ నిర్మాత గణేష్ బాబు ఈ పాట కోసం ఎనభై నుంచి కోటి రూపాయలు దాకా ఇవ్వటానికి సిద్దపడ్డారు. ఈ విషయమై ఇలియానా సన్నిహితులు ఒకరు వ్యాఖ్యానిస్తూ..ఇలియానాను ఆ పాట కోసం అడిగిన మాట వాస్తవమే.. అలాగే మంచి ఎమౌంట్ ని కూడా ఆఫర్ చేసారు. అయితే ఆమెకు తెలుగులో టాప్ హీరోయిన్ గా ఇమేజ్ ఉంది. ఇలాంటి పొజీషన్ లో ఐటం గర్ల్ గా ముద్రపడటానికి ఆమెకు ఇష్టం లేదని చెప్పుకొచ్చాడు.
మరి బాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ కత్రినాకైఫ్,బిపాసాబసు వంటి వారు ఐటమ్ సాంగ్స్ తో పాపులర్ అవుతున్నారుగా అంటే...దానికి సమాధానంగా..అయ్యుండవచ్చు..కానీ బాలీవుడ్ అనేది ప్రత్యేకమైన ఫీల్డ్. ఇక్కడలాగ ముద్రవేయటం అనేది ఉండదు. తెలుగులో ఓ పాత్ర క్లిక్ అయ్యితే అన్నీ అలాంటి పాత్రలే వస్తాయి..అలాగే ఐటం సాంగ్ క్లిక్ అయ్యితే అంతా వారికి ఐటం సాంగ్ నే ఆఫర్ చేస్తారు అని చెప్పుకొచ్చారు. అలాగే ఇక్కడ ఐటం సాంగ్ చేస్తే ఫేడవుట్ అయిన ఆర్టిస్టుగా పరగణిస్తారు అన్నారు. ఇక దర్సకుడు హరీష్ శంకర్ ఈ విషయమై మాట్లాడుతూ..ఏప్రియల్ లో ఈ పాట షూట్ జరుగుతుంది. అప్పటివరకూ రకరకాల ఆప్షన్స్ చూస్తాము..టైమ్ ఉందిగా అని అన్నారు. అలాగే పెద్ద ఏక్ట్రస్ నే ఆ పాటకు తీసుకుంటామని చెప్పుకొచ్చారు. పవన్ అభిమానులంతా గబ్బర్ సింగ్ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications











