twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇలియానా ఫ్యూచర్ జూ ఎన్టీఆరే నిర్ణయించాలి ..!

    By Sindhu
    |

    ఇలియానాకి ఇప్పటికీ డిమాండ్ తగ్గలేదేమో కానీ ఆమె ఫ్రెజెన్స్ తో సినిమాలు ఆడే రోజులైతే ఎప్పుడో పోయాయి. 'ఆట"లాంటి సినిమాకి కలెక్షన్లు రావడానికి కారణమైన ఇలియానా, 'దేవదాసు" విజయంలో కీలక భూమిక పోషించిన ఇలియానా ఇటీవలి కాలంలో అదే విధంగా సక్సెస్ కాలేకపోతోంది. సినిమా బాగోకపోతే ఇలియానా ఉన్నా కానీ జనం థియేటర్లకి రావడం లేదు. ఈ నేపథ్యంలో హిట్టిస్తేనే ఇలియానా తన ఉనికి నిలబెట్టుకోగలుగుతుంది. 'రెచ్చిపో", 'సలీమ్" వంటి డిజాస్టర్స్ తర్వాత ఏడాదికి పైగా గ్యాప్ తీసుకుని 'శక్తి"తో వస్తున్న ఇలియానాకి ఈ సమ్మర్ లో రెండు పరీక్షలు ఎదురు కానున్నాయి.

    అవేంటంటే జూ ఎన్టీఆర్ తో 'శక్తి", దగ్గుబాటి రాణా తో 'నేను నా రాక్షసి" కేవలం కొద్ది వారాల వ్యవధిలో విడుదల కానుండగా ఈ రెండిట్లో ఒక్కటైనా మంచి హిట్ అయితేనే ఇలియానా తన డిమాండ్ నిలుపుకోగలుగుతుంది. ఇప్పటికే సమంత, కాజల్, తమన్నా తదితరుల కారణంగా ఇలియానా హిట్ ఎదుర్కొంటోంది. ఇక దానికి పరాజయాలు కూడా తోడయితే ఆమె పని మరింత జటిలమవుతుంది. అయితే తెలుగులో ఫ్లాప్స్ వచ్చినా కానీ తమిళం, హిందీలో ఫ్రెష్ గా జర్నీ స్టార్ట్ చేస్తున్నానని ఆమె ఓ పక్క ధీమాగానే ఉండి ఉండొచ్చు..

    English summary
    ‘Shakti’ has become a life and death movie for ileana to sustain her career in Telugu. A hit is what she requires urgently else the in flow of new, fresh young girls would drain away this black Goan beauty. Let us see, how Tarak decides her future?
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X