twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శక్తి చిత్రం దెబ్బకొడుతుందేమోనని ఇలియానా డౌట్

    By Srikanya
    |

    ఇలియానా, ఎన్టీఆర్ కాంబినేషన్ లో శక్తి చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. తెలుగులో క్రేజీ ప్రాజెక్టుగా రూపొందిన ఈ చిత్రం తమిళంలోనూ 'ఓం శక్తి"టైటిల్ తో విడుదల కానుంది. తెలుగుతో పాటు తమిళంలోను ఈ చిత్రాన్ని ఏకకాలంలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.దాంతో ఇలియానా గుండెళ్లో రాయి పడిందంటున్నారు. ఎందుకంటే ఆమె తమిళంలో శంకర్ త్రీ ఇడియట్స్ చిత్రం ఒప్పుకుంది. ఆ చిత్రంతో తమిళంలో ప్రెష్ గా ఎంట్రీ ఇద్దామని ప్లాన్ లో ఉంది. ఈ మధ్యలో శక్తి చిత్రం విడుదల కానుంది.

    తమిళలకు ఎన్టీఆర్ కొత్త..అంతేగాక శక్తి ఆడియో కూడా అనుకున్నంతగా పేలలేదు. ఈ నేపద్యంలో తమిళంలో ఈ చిత్రం డబ్బింగై కొంచెం అటూ ఇటూ అయినా తనని ఇబ్బందుల్లోకి తోస్తుందని భావిస్తోందని తెలుస్తోంది. ఇప్పటికే అక్కడ తాప్సీ,తమన్నా, త్రిషలతో పూర్తి పోటీ వాతావరణం ఏర్పడి ఉంది. వీటికి తోడు ఆమె గతంలో తమిళంలో చేసిన కేడీ చిత్రం డిజాస్టర్ అయి చాలా కాలం వరకూ తమిళ తంబీల దృష్టిలో పడనీయకుండా చేసింది.దాంతో శక్తి తమిళ రిలీజ్ వైపు ఆమె భయం భయంగా చూస్తోంది. అయితే ఆమె భయాలు అర్దరహితమైనవని, తెలుగు, తమిళంలో ఈ చిత్రం పెద్ద హిట్టు అవుతుందని ఎన్టీఆర్ అభిమానులు కొట్టిపారేస్తున్నారు.

    ప్రస్తుతం ఇలియానా నటించిన నేనూ...నా రాక్షసి చిత్రం కూడా త్వరలోనే విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. వీటితో పాటు ఆమె శంకర్ దర్శకత్వంలో త్రీ ఇడియట్స్ తెలుగు,తమిళ వెర్షన్స్ లో నటిస్తోంది. అలాగే పవన్‌కళ్యాణ్‌తో ఓ సినిమా, మహేష్‌బాబుతో మరో సినిమా, ప్రభాస్‌తో ఓ సినిమా కమిటైంది.

    English summary
    Jr NTR starrer ‘Shakthi’ film is being dubbed into Tamil it seems. Producer Ashwini Dutt is planning ot do so and get 
 
 the credit of introducing Jr.NTR to Tamil Cinema with this most expensive film ‘Shakthi’.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X