హాట్ టాపిక్: సైజుల కోసం ఇలియానా సర్జరీ
గోవా బ్యూటీ ఇలియానా రీసెంట్ గా చేసిన స్నేహితుడు చిత్రంలో బక్కచిక్కిందని, అందం పోయిందని రకరకాల కామెంట్స్ వచ్చాయి. అంతేగాక రీసెంట్ గా తన సైజులు కోసం కాస్మిటిక్ సర్జరీ చేయించుకోనున్నట్లు గత కొద్ది రోజులుగా ముంబై మీడియా వార్తా కథనాలు రాస్తోంది. ఆమె ముంబైలో కొందరు సర్జన్స్ ని సంప్రదించినట్లు చెప్తున్నారు. దీనిపై ఓ ఇంగ్లీష్ డైలీ ఇలియానాను సంప్రదించింది. ఆమె వెంటనే దీన్ని ఖండించింది.
ఆమె మాట్లాడుతూ... అదృష్టవశాత్తూ నాకు అలాంటి అవసరం లేదు.. నేను సీ పుడ్స్, స్వీట్స్ బాగా తింటాను. నేను ఎక్సట్రా పౌండ్స్ పెరగాలా తగ్గాలా అన్నదాని గురించి ఆలోచించను. కేవలం నా ఫిటెనెస్ కోసం ఇరవై నిముషాల సేపు బ్రిస్కీ వాక్ చేస్తాను అంతే.. అంది. అలాగే అక్కడ మీడియా ప్రచురిస్తున్నవన్నీ బేస్ లెస్ రూమర్స్ అని అంది. ఇక ప్రస్తుతం ఇలియానా.. అల్లు అర్జున్ సరసన నటిస్తోంది. త్రివిక్రమ్ దర్సకత్వంలో రూపొందుతోన్న చిత్రంలో ఆమె హీరోయిన్ గా చేస్తోంది. అలాగే ఆమె రవితేజ సరసన పూరి జగన్నాధ్ దర్శకత్వంలో దేముడు చేసిన మనుషులు చిత్రంలో చేస్తోంది.


Click it and Unblock the Notifications











