నట్టికుమార్ కి హాట్ స్టార్ ఇలియానా కౌంటర్..
"ఔను... నాకు కరెక్టు అనిపించినంత ఎమౌంట్ నే నేను అడిగాను. అందులో తప్పేంటి? నన్ను నమ్మి అంత మొత్తం ఇవ్వడానికి నిర్మాతలు కూడా సిద్ధపడడం సంతోషంగా ఉంది. అయినా దీని గురించి ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు అని రెట్టించి చెప్పింది ఇలియానా. ఆమె రెండు కోట్లకు రేటు పెంచటంపై నట్టికుమార్ ఓ టీవీ ఛానెల్ లో విమర్శలు చేసారు. దాంతో మండిన ఆమె నాకు నచ్చినట్లు అడిగాను..ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు అని తెగేసి చెప్పింది. నిజానకి నట్టికుమార్ తాను నిర్మిస్తున్న బొమ్మాళి చిత్రంలో హీరోయిన్ గా ఆమెను అడిగి ఆమె కాదనేసరికి ఇలా టీవీ ఛానెల్స్ కి ఎక్కి ఆమెను బద్మామ్ చేయటానికి ప్రయత్నించాడని వినిపించింది. దాంతో ఇలియానా ఇలా కౌంటర్ ఇచ్చింది. ఇలియానా నటించిన రెండు చిత్రాలు 'శక్తి', 'నేను నా రాక్షసి' విడుదలకు సిద్ధమయ్యాయి. "ఎన్టీఆర్, రాణా ఇద్దరూ ఇద్దరే. ఆ చిత్రాల ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను" అని చెప్పింది. వీటితో పాటు ఆమె శంకర్ దర్శకత్వంలో త్రీ ఇడియట్స్ తెలుగు,తమిళ వెర్షన్స్ లో నటిస్తోంది. అలాగే పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా, మహేష్‌బాబుతో మరో సినిమా, ప్రభాస్‌తో ఓ సినిమా కమిటైంది.


Click it and Unblock the Notifications











