జూ ఎన్టీఆర్ కి ఇలియానా వద్దంట కాజలే ముద్దంట!
ఎన్టీఆర్ హీరోగా రూపొందిన 'అదుర్స్" సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలవుతోంది.ఇది కాకుండా తను 'శక్తి", 'బృందావనం" సినిమాల్లో నటిస్తున్నాడు. తెలుగులో అగ్రతారగా దూసుకుపోతున్న కాజల్ ప్రస్తుతం జూ ఎన్టీఆర్ సరసన దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం 'బృందావనం"లో నటిస్తుంది. తెలుగు చలన చరిత్ర రికార్డులను తిరగరాసిన 'మగధీర" లో నటించిన తర్వాత ఆమె చిత్రాల కోసం వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకుండా చేతి నిండా సినిమాలతో జిజీగా ఉంది.
ఇదిలా ఉంటే 'శక్తి" చిత్రంలో కూడా కాజల్ నే ఎంపికచేసారట. తొలుతగా ఈ సినిమాలో ఇలియానాని నటింపజేయాలనుకున్నారట కానీ 'రెచ్చిపో", 'సలీమ్" వరుస ప్లాప్ అవ్వటంతో ఈ ఛాన్స్ కాజల్ కొట్టేసిందని సమాచారమ్. ప్రస్తుతం ఎన్టీఆర్ సరసన నటిస్తున్న కాజల్, అతనితో నటించడం చాలా గొప్పగా ఉందంటూ అలాగే చిత్ర దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా చిత్రాన్ని చక్కగా తెరకెక్కిస్తున్నారంటూ ఆమె వివరించింది. ఇందులో ఆమె 'భూమి" అనే పాత్ర పోషిస్తోంది. నా వాస్తవ జీవితానికి దగ్గరగా ఉండే పాత్రలో నటిస్తునందుకు చాలా సంతోషంగా ఉందంటూ కాజల్ సంతోషాన్ని వ్యక్తపరిచింది. 2009 లా 2010 కూడా తనకు మంచి పేరు తెచ్చిపెడుతుందని ఆమె ఆశాభావం తెలియజేసింది.


Click it and Unblock the Notifications











