అది సినిమాల కోసం ఎంతకైనా దిగజారుతుంది...!
ఆడవాళ్లు ఎంత సౌమ్యంగా కనిపిస్తారో తేడాలొస్తే అపర కాళీలా మారిపోతారు. సుకుమారంగా కనిపించే వాళ్ల కళ్లల్లో నిప్పులు కూడా కురుస్తాయంటే నమ్మాలి. 'ఇలియానా" ఎంత కూల్ గా ఉంటుందీ, ప్రశాంతమైన శంగార దేవతలా కనిపిస్తుంది. కానీ కోపం వస్తే ఆమో ముందుకు ఆమె తల్లి కూడా వెళ్లలేదట. ఇటీవల హీరోయిన్ చార్మికి ఇస్తానన్న సినిమాను నిర్మాతలు నిర్ణయం మార్చుకుని ఇలియానాకు ఆఫర్ చేశారట.
'నేను నటించడానికే డబ్బులడిగాను. మరి ఆమె ఇంకేం చేయడానికి ఒప్పుకుందో" అని చార్మి కామెంట్ చేయడాన్ని తట్టుకోలేని ఇలియానా మండిపడి పోతూ 'ఆమె గురించి తెలుగు ఇండస్ట్రీకే కాదు, తమిళ, మళయాళం వాళ్లక్కూడా తెలుసు సినిమాల కోసం ఏమైనా చేస్తుంది". ప్రస్తుతం సినిమాల్లేకే అలా పిచ్చి వాగుడు వాగుతుంది అంటూ ఇలియానా కూడా చార్మి మాటలను తిప్పికొడుతూ కస్సుమందట. మీలో మీరే ఇలా కొట్టుకుంటే మరో హీరోయిన్ వచ్చి ఆ అవకాశం తన్నుకు పోతుంది అంటున్నారు ఇది విన్న వారంతా.


Click it and Unblock the Notifications











