ఇలియానా పట్టు తగ్గుతోందా?
ఇలియానా 'కిక్" సక్సెస్‌తో మరింత 'రెచ్చిపో"తుందనుకున్న ఇలియానా పూర్తిగా చతికిలపడిందని తీర్మానించలేం కాని, మొదట్లో ఉన్నంత జోరు కాస్తంత తగ్గిందని మాత్రం నిరభ్యంతరంగా తీర్మానించవచ్చు. త్వరలో విడుదలవుతున్న 'సలీం" తర్వాత ఇలియానా నటిస్తున్న తెలుగు చిత్రమేదీ ప్రస్తుతం నిర్మాణంలో లేకపోవడాన్ని ఈ తీర్మానానికి ప్రాతిపదికగా తీసుకోనవసరం లేకపోయినప్పటికీ, ఆ అంశాన్ని కూడా ఒక కారణంగా మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు.
తమిళంలో విక్రమ్ సరసన ఓ చిత్రం, తన తొలిచిత్ర నాయకుడు రామ్‌కు జంటగా మరో చిత్రంలోనూ ఇలియానా నటిస్తున్నదనే వార్తలు వెలువ డినప్పటికీ అవి కార్యరూపం దాల్చేందుకు మరి కొంత సమయం పట్టే అవకాశముంది. అలాగే, 'రాఖీ" తర్వాత ఎన్టీఆర్‌తో మెహర్ రమేష్ దర్శకత్వంలో అశ్వినీదత్ నిర్మిస్తున్న 'శక్తి" టైటిల్ (ఖరారు కాని)అనే చిత్రంలోనూ ఇలియానా హీరోయిన్‌గా ఎంపికయినట్లు అనధికారిక వార్తలొచ్చినప్పటికీ, ఈ చిత్రం దిల్‌రాజు నిర్మిస్తున్న 'బృందావనం" తరువాత కానీ విడుదలయ్యే అవకాశం లేదు. ఇలియానా ప్రత్యర్ధులైన కాజల్, హన్సిక, త్రిష, నయనతార, అనుష్కలు ఏకకాలంలో రెండుమూడు చిత్రాల్లో నటిస్తూ ఊపిరి తీసుకోవడానికి కూడా ఖాళీ లేనంత బిజీగా ఉంటున్న విషయం ఇక్కడ గమనార్హం!


Click it and Unblock the Notifications