ఇలియానా మేనేజరే సమంతాను...(ట్రేడ్ సీక్రెట్)
రీసెంట్ గా ఇలియానా మేనేజర్ ని తన మేనేజర్ గా పెట్టుకుని బిజీ అయ్యిపోయింది సమంత.ఆ మేనేజర్ ది గోల్డెన్ హ్యాండ్ అని తెలియటంతో ఆమె అతన్నే పెట్టుకుని తమిళంలో ప్లాప్ లో ఉన్న ఆమె ఒక్కసారిగా బిజీ అయ్యిపోయింది.నిజానికి ఆ మేనేజర్ చాలా ఎక్కువ కమీషన్ తీసుకుంటాడని అంటారు. ఇది తెలిసిన ఇలియానా మండిపడింది.తన మేనేజర్ ని హైజాక్ చేసారని కోప్పడింది. తన కన్నా ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నాడనే కారణంతో ఇలియానా అలిగి ఇక నుండి తానే డేట్స్ చూసుకుంటానని చెప్పి బై చెప్పేసింది. ఇక ఆ మేనేజర్ ని పెట్టుకోగానే మొదట వచ్చిన ఆఫర్ దూకుడు. ఈ సినిమా పెద్ద విజయం సాధించేయడంతో సమంత నమ్ముకున్న సెంటిమెంట్ నిజమైంది. సరిగ్గా ఆరేళ్ళ క్రితం ఇలియానా కెరీర్ కూడా 'పోకిరి'తో ఇలాగే మలుపు తిరిగింది. ఇలియానా కోప్పడిన విషయం తెలుసుకున్న సమంత సైలెంట్ అయ్యిపోయింది కానీ తెలివిగా ఏ కామెంట్ చెయ్యకుండా తన పని తాను చేసుకుపోతోంది.ప్రస్తుతం ఇలియానా తెలుగులో త్రివిక్రమ్,అల్లు అర్జున్ కాంబినేషన్ లో డివివి దానయ్య నిర్మిస్తున్న చిత్రంలో చేస్తోంది. అయితే సమంత మాత్రం తాను నెంబర్ వన్ ని కాదంటోంది.
సమంత ఈ విషయమై మాట్లాడుతూ..నెంబర్ వన్ అనేది తాత్కాలికం మాత్రమే...ప్రతీ శుక్రవారం నంబర్స్ మారిపోతూంటాయి. ఇక్కడ చాలామంది తెలివైన,టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు.వాళ్లకి మంచి అవకాసం వస్తే ప్రూవ్ చేసుకుంటారు.నేను అదృష్టవంతురాల్ని రైట్ టైమ్ లో రైట్ ప్రాజెక్టులు పడ్డాయి. నా సక్సెస్ కు కారణం ట్యాలెట్ ఒక్కటే కాదు...డెస్టినీ కూడా అంది సమంత. ఆమెను మీకు నెంబర్ వన్ స్టేజీకి వెళ్లామని భావిస్తున్నారా అని మీడియా వారు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ ఇలా స్పందించింది.అలాగే ప్రస్తుతం సమంత తన తదుపరి ప్రాజెక్టుల గురించి చెబుతూ...రాజమౌళి ఈగ,గౌతమ్ మీనన్ తో చేస్తున్న సినిమాలు రెండూ తమిళ,తెలుగులో ఒకేసారి విడుదల అవుతాయి. రెండింటిలోనూ నానినే హీరో. అలాగే సిద్దార్ధ,నాగచైతన్య,మహేష్ బాబు సరసన ప్రాజెక్టులు కన్ఫర్మ్ అయ్యాయని వినపడుతోంది అంటే...ఫస్ట్ డే షూట్ అయితే కానీ నేను ఏ సినిమానూ నా చేతిలో ఉందని చెప్పలేను అంది. నాకు అటువంటి కొన్ని నమ్మకాలు ఉన్నాయని తెలివిగా సమాధానం చెప్పింది.
ఇక ప్రస్తుతం సమంత డైరీ ఫుల్ గా ఉంది. ఆమె గౌతమ్ మీనన్ మరో చిత్రంలో నటిస్తోంది. అలాగే రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈగ లోనూ చేస్తోంది. అంతేగాక నాగచైతన్య సరసన ఆటోనగర్ సూర్యలోనూ, మహేష్ సరసన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలోనూ ఆమెనే తీసుకున్నారు.


Click it and Unblock the Notifications











