బంపర్ చాన్స్ కొట్టేసిన ఇలియానా?

By Bojja Kumar

హైదరాబాద్: తెలుగు సినిమాలు మానేసి ‘బర్ఫీ' చిత్రంలో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఇలియానా...ఆ చిత్రం విజయం సాధించడంతో బిజీ అయిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు గ్రేట్ 2 హీరోలతో మాత్రమే అవకాశాలు దక్కించుకున్న ఇలియానాకు ఎట్టకేలకు బంపర్ చాన్స్ దక్కినట్లు తెలుస్తోంది.

బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ హీరోగా తెరకెక్కబోతయే ‘ఫ్యాన్' చిత్రంలో ఇలియానాను హీరోయిన్‌గా ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ బాలీవుడ్ సినీ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలింస్ నిర్మిస్తోంది. ఈచిత్రానికి మనీష్ శర్మ దర్శకత్వం వహించనున్నారు. త్వరలో ఇలియానా గురించి న్యూస్ అఫీషియల్‌గా వెల్లడికానుంది. అక్టోబర్ నుండి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మిదలు కానుంది.

Ileana to pair up with Shah Rukh Khan ?

ప్రస్తుతం ఇలియానా హిందీలో సైఫ్ అలీ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న ‘హ్యాపీ ఎండింగ్' చిత్రంలో నటిస్తోంది. ఇక ఆమె తెలుగులో చివరిసారిగా 2012లో ‘జులాయి', ‘దేవుడు చేసిన మనుషులు' చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత ఆమె తెలుగు చిత్రాలు ఏమీ చేయలేదు. కావాలనే ఆమె తెలుగు సినిమాలకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X