»   »  అదో చెత్త అనుభవం: ఇలియానా

అదో చెత్త అనుభవం: ఇలియానా

Posted By:
Subscribe to Filmibeat Telugu
భారీ సినిమాలు జల్సా,భలే దొంగలు రిలీజయినా ఆ సినిమాల హీరోయిన్ ఇలియానా ఒక్క సినిమా లో కూడా కొత్తగా బుక్కవలేదు. పోనీ తమిళ రంగానికి మిగతావాళ్ళలా వలస పోదామంటే అక్కడ వారి పద్దతులు ఆమెకి నచ్చలేదట. అంతేగాక ఆమె ఒక్కో సినిమా ఒక్కో అనుభవం మిగిలిస్తూంటుంది. అలా తమళంలో చేసిన ఒకే ఒక సినిమా చేసినా విరక్తి పుట్టించిందని కొన్ని చెత్త అనుభవాలు మిగిల్చిందంటూ దగ్గరవాళ్ళ దగ్గర చెప్పుకొచ్చిందిట. అంతేగాక తనను తెలుగు పరిశ్రమలో ప్రతివారు తనను ఎంతో గౌరవిస్తారంటూ ఇక్కడ పద్దతులు బాగుంటాయంటూ పొగుడుతోంది.

అలాగే చిత్రాల ఎంపికలో తాను జాగ్రత్తగా ఉంటానని, అయితే సినిమా విజయం అనేది మన ఒక్కరి చేతిలోఉండదని అంటోంది. సర్లేగాని తమిళ సినిమాతో చెత్త అనుభవం ఎదురైందని అంటున్నావు ... కదా, ఏంటది అని ఇదంతా విన్నవారు ఆసక్తిగా ప్రశ్నిస్తే సీరియస్ గా లుక్కిచ్చి "చెప్పాను కదా, చెత్త అనుభవమని అంటూ... "ముగించిందిట. ఇంతకి ఆమె చేసిన తమిళ సినిమా కె.డి .ఇందులో ఎ.మ్ .రత్నం కుమారుడు రవికృష్ణ హీరో.ఇందలో ఇలియానా మాత్రమే కాక హ్యాపీడేస్ తమన్నా కూడా నటించింది. భారీగా తీసిన ఆ సినిమా అక్కడ వక్కవుట్ కాలేదు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X