సాఫ్ట్ వేర్ కుర్రాళ్ళే ఇలియానాకు....
ఇదో పెద్ద పనైపోయింది..అంటోంది నిట్టూరుస్తూ..తనకు వచ్చే ప్రేమ లేఖలు గురించి చెపుతూ.."కాలేజ్ ఏజ్‌లోనే నాకు ఇలాంటి ప్రేమలేఖలు కుప్పలు కుప్పలుగా వచ్చేసేవి. హీరోయిన్ అయ్యాక అవి రెట్టింపయ్యాయి. ఈమెయిల్ ఇన్‌బాక్స్ రోజూ నిండిపోతోంది. ఒకటి రెండు తప్ప అన్నీ డిలీట్ చేయాల్సి వస్తోంది తెలుసా' అని చెప్తోందామె. ఇలియానా మొయిల్ ఐడి తెలుసున్న వాళ్ళు ఆమెకు కుప్పలు కుప్పలుగా లవ్ లెటర్స్ పంపుతున్నారుట. ఆమెకు తెలుగు, తమిళంలో మార్కెట్ ఎక్కువ మార్కెట్ ఉండటంతో అక్కడ నుంచే ఇవి వస్తున్నాయిట.
ముఖ్యంగా ఈ ఈ మెయిల్ లేఖలు సాఫ్ట్ వేర్ పీపుల్ నుంచి వస్తూంటాయని ఆమె సందేహం. అలాగే ఈ రోజుల్లోనూ పల్లెలనుంచి ఫ్యాన్ మెయిల్ (ఉత్తరాలు)వస్తున్నాయంటోంది. వారికి తన ఫోటోను సంతకం పెట్టి పంపుతాను అంటోంది. అయితే ఇ మెయిల్ ద్వారా వచ్చే వాటికి రిప్లై ఇవ్వను అని చెప్తోంది. ఒక సారి రిప్లై ఇస్తే అది ఓ ప్రవాహం అని కంటెన్యూ అవుతుందని అందుకే ఎంకరేజ్ చేయనని చెప్తోంది. ఇంతకు ముందు అలాగే లెటర్ బాగుంది కదా అని రిప్లై ఇస్తే వారం తిరక్క ముందే తన గుమ్మం ముందు ప్రత్యక్ష్యమయ్యాడు ఓ కుర్రాడు..అందుకే అటువంటి సాహసాలు చెయ్యను అంటోంది.


Click it and Unblock the Notifications











