బన్నీ కోసం ఆ..రెండింటి సైజులు తగ్గించుకున్న ఇలియానా
అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా రూపొంద బోతోన్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 24 నుంచి ఈ చిత్రం ప్రారంభం కాబోతోంది. ఈ సినిమాలో సన్న నడుము నాజూకు సుందరి ఇలియానాను ఇప్పటికే ఖరారు చేశారు. అయితే వాస్తవానికి ఇలియానాతో చేయడం బన్నీకి ఇష్టం లేదట. కానీ త్రివిక్రమ్ సిద్దం చేసుకున్న కథలో కథానాయిక పాత్రకు ఇలియానా మాత్రమే సూట్ అవుతుందని, ఆమెను తీసుకోవాలని త్రివిక్రమ్ పట్టుబట్టడంతో బన్నీ అంగీకరించక తప్పలేదు.
హీరోయిన్ల మధ్య పోటీ విషయానికొస్తే ఇలియానా ఈ మధ్య చాలా వెనక బడింది. ప్రేక్షకులకు ఆమె పాత బడిపోవడం ఒక కారణం అయితే, ఆమె రెమ్యూనరేషన్ భారీగా ఉండటం కూడా మరో కారణం. తనకు అవకాశాలు మందగించడానికి ఇది కూడా ఓ కారణమని గమనించిన ఇలియా...తన రెమ్యూనరేషన్ కొంత తగ్గించుకుందని ఫిల్మ్ నగర్ టాక్. అంతే కాకుండా బన్నీని మెప్పించడానికి తన బరువు కూడా తగ్గించుకుందట. ఈ విధంగా బన్నీ కోసం తన రెమ్యూనరేషన్ సైజుతో పాటు, తన బాడీ సైజుకూడా తగ్గించుకుంది గోవా సుందరి ఇలియానా.


Click it and Unblock the Notifications











