బన్నీ కోసం ఇలియానా బాగా తగ్గించింది
అల్లు అర్జున్,త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపొందించే చిత్రం కోసం ఇలియానాని సంప్రదించి రెండు కోట్లకు ఆఫర్ చేసారు.అయితే ఇది శక్తి, నేనూ నా రాక్షసి విడుదలకు ముందు సంగతి. అయితే ఇప్పుడు సీన్ మారింది. వరస ఫ్లాపుల హీరోయిన్ ని అంత రేటు పెట్టి పెట్టుకోవటమెందుకుని నిర్మాత,హీరోలు ఫీలవటంతో ఆమెను కాదనుకుని వేరే వాళ్ళని సంప్రదిస్తున్నారు. మరో ప్రక్క తెలుగులో ఇలియానాకు ఒక్క ఆఫర్ కూడా లేకుండా పోయింది. ఈ నేపధ్యంలో ఆమె రియలైజై అల్లు అర్జున్ ప్రక్కన చేస్తే మళ్ళి స్టార్ డమ్ వస్తుందని బావించి తన రేటుని ఒక్కసారిగా కోటి రూపాలయకు తగ్గించుకుంది.మిగతా హీరోలు ఎవరికైనా కోటిన్నరకి పైసా తగ్గనని క్లారిటీగా చెప్తోంది. అది అల్లు అర్జున్ కి ఇలియానా ఇచ్చిన డిస్కౌంట్ ఆఫర్. దానయ్య నిర్మించే ఈ చిత్రం వచ్చే నెలలో సెట్స్ మీదకు వెళ్ళుతుంది. త్రివిక్రమ్ ఇప్పటికే స్క్రిప్టు వర్క్ పూర్తి చేసి టూర్ కి వెళ్ళిన అల్లు అర్జున్ కోసం ఎదురుచూస్తున్నాడు.


Click it and Unblock the Notifications











