Don't Miss!
- News బాలయ్య ఎన్నికల ప్రచార జోరు: కీలక హామీలు
- Sports CSK vs LSG: వారెవ్వా రాహుల్.. వాటే క్యాచ్!వీడియో
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
రామ్ చరణ్ సినిమాని రిజెక్టు చేసిన ఇలియానా
రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా చేయాలని చాలా మంది హీరోయిన్స్ ఉవ్విళ్ళూరుతూంటారు. ఎందుకంటే క్రేజ్ ఉన్న హీరో, పెద్ద బడ్జెట్, స్టార్ డైరక్టర్ ఉంటారని. అయితే తాజాగా ఇలియానా..చరణ్ తాజా చిత్రం మెరుపుని రిజెక్టు చేసిందని తెలిసింది.అయితే దానికి కారణం ఆ చిత్రంలో ఇప్పటికే కొంత భాగం చేసిన కాజల్..డేట్స్ ప్లాబ్లం అని తప్పుకుంది. మరో ప్రక్క జెనిలియాపై ఆరెంజ్ వివాదంలో కామెంట్స్ చేయటం కూడా ఇలియానాని ఆలోచనలో పడేసిందిట. అయితే మెరుపులో గెస్ట్ పాత్ర కోసం అడిగారని అందుకే కాదనుకుందని మరో వాదన వినపడుతోంది. అదేమీ కాదని కాజల్ తప్పుకుంది కాబట్టి ఆ పాత్ర ఇలియానా చేస్తే బావుంటుందనే దర్శకుడు ధరణి భావించి అడిగాడని, డేట్స్ క్లాష్ అవుతాయని చెప్పి ఇలియానా తప్పుకుందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ప్రస్తుతం ఎన్.టి.ఆర్. 'శక్తి'లోను, రానా 'నేను నా రాక్షసి'లోను హీరోయిన్ గా చేస్తోంది. అలాగే త్రీ ఇడియట్స్ రీమేక్ లో శంకర్ దర్శకత్వంలో చేయటానికి కూడా కమిటైంది.