ఇలియానాపై మోజుపడ్డ మరో స్టార్ హీరో!
ముంబై : హీరోయిన్ ఇలియానా కెరీర్ బాలీవుడ్లో ఆశాజనకంగానే సాగుతోంది. ఆమె నటించిన తొలి బాలీవుడ్ మూవీ 'బర్ఫీ' మంచి విజయం సాధించడంతో ఇలియానాను హీరోయిన్ గా తీసుకునేందుకు పలువురు బాలీవుడ్ దర్శకులు, హీరోలు ఆసక్తి చూపుతున్నారు.
బర్ఫీ తర్వాత షాహిద్ కపూర్ సరసన 'పతా పోస్టర్ నిక్లా హీరో' సినిమాలో అవకాశం దక్కించుకుంది ఈ గోవా భామకు తాజాగా మరో బాలీవుడ్ స్టార్ హీరో సరసన అవకాశం దక్కినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సైఫ్ అలీఖాన్ తర్వలో చేయబోతున్న సినిమాలో ఇలియానాను ప్రిఫర్ చేసినట్లు సమాచారం.
ఈ చిత్రానికి బాలీవుడ్ దర్శక ద్వయం రాజ్-డికె దర్శకత్వం వహించనున్నారు. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి. మరో వైపు బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ కూడా ఇలియానాకు తన చేయబోయే సినిమాలో అవకాశం ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు టాక్.
తెలుగు మూవీ 'ఠాగూర్' చిత్రానికి రీమేక్ అక్షయ్ కుమార్ హీరోగా హిందీలో రూపొందుతున్న 'గబ్బర్' చిత్రంలో ఇలియానాకు చాన్స్ దక్కినట్లు రూమర్స్ వినిపించాయి. అయితే ఆ చిత్ర నిర్మాత సంజయ్ లీలా బన్సాలీ వాటిని ఖండించారు. తాము ఇంకా ఈ సినిమాకు హీరోయిన్ ను ఖరారు చేయలేదని స్పష్టం చేసారు. గబ్బర్ చిత్రానికి తెలుగు దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహించబోతున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











