ప్రియుడి మాయలో ఇలియానా, ఆస్తులు అమ్మకానికి!
హైదరాబాద్: తెలుగు చిత్రం ‘దేవదాసు' ద్వారా సినిమా కెరీర్ ప్రారంభించిన ఇలియానా అతి తక్కువ కాలంలోనే దక్షిణాదిన స్టార్ హీరోయిన్ రేంజికి ఎదిగింది. కోటికిపైగా రెమ్యూనరేషన్ తీసుకునే భామల లిస్టులో చేరి పోయింది. ‘బర్ఫీ' చిత్రం ద్వారా బాలీవుడ్ ఛాన్స్ దక్కడంతో పూర్తిగా సౌత్ సినిమాలను పక్కన పెట్టేసింది.
అయితే బాలీవుడ్ ఇలియానా కెరీర్ అనుకున్నంత ఆశాజనకంగా సాగడం లేదు. ప్రస్తుతం ఆమె చేతిలో ‘హ్యాపీ ఎండింగ్' అనే ఒకే ఒక్క బాలీవుడ్ చిత్రం ఉంది. ప్రస్తుతం ఇలియానా పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలాగా తయారైంది. మళ్లీ సౌత్ సినిమాల కోసం వెనక్కు రాలేని పరిస్థితి, అటు బాలీవుడ్ అవకాశాలు కూడా పెద్దగా లేవని అంటున్నారు. అయితే ఇలియానా తన కెరీర్ గురించి సరిగా పట్టించుకోవడం...ప్రియుడి మాయలో పడిందని, సినిమా అవకాశాల గురించి పెద్దగా పట్టించుకోకుండా ప్రియుడి వద్ద ఫోటోగ్రఫీ నేర్చుకోవడంపైనే ఎక్కువ దృష్టి పెడుతోందని అంటున్నారు.
గోవా సుందరి ఇలియానా గతకొంత కాలంగా ఆస్ట్రేలియన్ బాయ్‌ఫ్రెండ్ ఆండ్రూ నీబోన్‌తో లవ్‌ఎఫైర్ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. 'హ్యాపీ ఎండింగ్' సినిమాలో ఆమెతో పాటు ఆండ్రూ కూడా నటిస్తున్నాడట. రాజ్ నిడిమోరు, కృష్ణ డీకే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఈ సినిమా షూటింగ్ లాస్ ఏంజిల్స్‌లో జరుగుతూ ఉండగా ఆండ్రూ తరచూ షూటింగ్ స్పాట్ కు వస్తూ ఉండేవాడట. ఇలియానా బాయ్ ఫ్రెండ్ కావడంతో యూనిట్ సభ్యులకు దగ్గరయ్యాడు. అదే సమయంలో సినిమాలోని ఓ పాత్రకు విదేశీ నటుడు అవవసరం కావడం...ఆండ్రూ అందుకు సరిపోయే విధంగా ఉండటంతో అతన్నే తీసుకున్నారట.

ఆండ్రూ ఆస్ట్రేలియాకు చెందిన ప్రొఫెషనల్ ఫోటో గ్రాఫర్. ఇలియానా-ఆండ్రూ మధ్య దాదాపు రెండేళ్లుగా పరిచయం ఉంది. రెండేళ్ల క్రితం క్రితం ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా వీరి మధ్య పరిచయం ఏర్పడిందని, అప్పటి నుంచి ఇద్దరి మధ్య రిలేషన్ బాగా పెరిగిందని, ఇరువురు ఒకరి అభిప్రాయాల ఒకరు బాగా తెలుసుకోవడంతో పాటు అర్థం చేసుకుంటున్నారని అంటున్నారు. అంతే కాదండోయ్...ఆ మధ్య ఒకసారి ఇలియానా అతన్ని తన ఇంటికి లంచ్‌కి ఇన్వైట్ చేసి తన పేరెంట్స్‌కి పరిచయం కూడా చేసిందట.
ఆస్తులు అమ్మకానికి...
ఇలియానా హైదరాబాద్ నుండి పూర్తికగా మకాం ఎత్తేయడానికి ప్లాన్ చేసుకుంటోందట. హైదరాబాద్‌లోని ల్యాంకో టవర్స్‌లో రూ. 1.25 కోట్లు పెట్టి అప్పట్లో కొనుగోలు చేసిన ఫ్లాట్‌ను ఇలియానా అమ్మకానికి పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీన్ని బట్టి అమ్మడు ఇక సౌత్ సినిమా వైపు చూడబోదని స్పష్టం అవుతోందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సౌత్‌లో కోటిగా పైగా రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్‌గా వరుస అవకాశాలు దక్కించుకున్న ఇలియానా......డబ్బు బాగానే పోగేసుకుంది.


Click it and Unblock the Notifications











