»   » త్రివిక్రమ్ ఒప్పించాడా? బన్నీతో ఇలియానా ఐటం సాంగ్!

త్రివిక్రమ్ ఒప్పించాడా? బన్నీతో ఇలియానా ఐటం సాంగ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఆ మధ్య త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్-ఇలియానా జంటగా ‘జులాయి' సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి ఫలితాలు రాబట్టింది. అప్పుడు బన్నీ సరసన హీరోయిన్‌గా నటించిన ఇలియానా...తాజాగా ఐటం సాంగ్ చేసేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ‘సన్నాఫ్ సత్యమూర్తి'(వర్కింగ్ టైటిల్) ఇలియానాను ఐటం సాంగ్ చేయించేందుకు ఒప్పించింది దర్శకుడు త్రివిక్రమే అని అంటున్నారు. ఈ విషయం అఫీషియల్ గా ఖరారు కావాల్సి ఉంది.

ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

గోవా సుందరి ఇలియానా తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్ గా తన హవా చాటింది. అయితే బాలీవుడ్ సినిమాలపై మోజుతో సౌత్ సినిమాలకు గుడ్ బై చెప్పిన ఇలియానా తొలి చిత్రం ‘బర్ఫీ'తో హిట్టు కొట్టింది.

Ileana special song with Allu Arjun

అయితే తర్వాత పలు అవకాశాలు వచ్చినా...అవి సరిగా ఆడక పోవడంతో ఇలియానా కెరీర్ అక్కడ డైలమాలో పడింది. అవకాశాలు కూడా బాగా తగ్గి పోయాయి. దీంతో ఆమె మళ్లీ సౌత్ సినిమాల వైపు చూస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆమెకు ఇక్కడ హీరోయిన్‌గా అవకాశం ఇవ్వడానికి మాత్రం ఎవరూ సిద్దంగా లేరు కానీ...కొందరు ఆమెను ఐటం సాంగు కోసం సంప్రదించినట్లు తెలుస్తోంది.

వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోవడం ఇష్టం లేక ఐటెంసాంగ్స్ చేయడానికి కూడా అభ్యంతరం లేదని తేల్చిచెప్పిందట. తాజా సమాచారం బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రంలో ఇలియానా ప్రత్యేకగీతంలో నర్తించబోతున్నట్లు తెలిసింది. ఈ పాట కోసం ఆమె భారీ పారితోషికాన్ని డిమాండ్ చేసిందని, తెలుగుప్రేక్షకుల్లో ఈ సుందరికున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని కోరినంత మొత్తంలో చెల్లించడానికి సిద్ధమయ్యారట.

‘సన్నాఫ్ సత్యమూర్తి' సినిమా విషయానికొస్తే...
బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘సన్నా ఆప్ సత్యమూర్తి' మూవీ ఆడియో మార్చి 14న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ ఆడియో వేడుకకు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు గెస్టులుగా హాజరయ్యే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరు స్టార్స్ త్రివిక్రమ్ కు చాలా క్లోజ్ కావడంతో వీరిని ఆహ్వానించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ విషయం అఫీషియల్ గా ఖరారు కావాల్సి ఉంది.

ఈచిత్రంలో సమంత, నిత్యామీనన్, అదాశర్మ హీరోయిన్స్. కన్నడ స్టార్ ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇతర పాత్రల్లో సింధుతులాని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, ఎం.ఎస్.నారాయణ, రావ్ రమేష్ నటిస్తున్నారు. జులాయి తర్వాత బన్నీతో చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.

వేసవిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ వెడ్డింగ్‌ ప్లానర్‌గా కనిపించనున్నారు. బన్నీ సృష్టించే పెళ్లి సందడి.. వినోదాలు పంచనుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. సాంకేతిక వర్గం ఆర్ట్ - రవీందర్, కెమెరా - ప్రసాద్ మూరెళ్ల, మ్యూజిక్ - దేవిశ్రీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - పి.డి.ప్రసాద్, నిర్మాత -ఎస్. రాధాకృష్ణ, స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - త్రివిక్రమ్ శ్రీనివాస్.

English summary
But if the latest buzz is to be believed, it may not be an adieu after all. It is heard that Ileana is set to feature in a special song with Allu Arjun in the upcoming flick ‘S/o Satyamoorty’ (tentative title) directed by Trivikram.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu