సక్సెస్ ‘కిక్’ లో ఇలియానా
'దేవదాసు" చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన గోవా సుందరి ఇలియానా ఆ చిత్రంతో బిజీ హీరోయిన్ గా మారిపోయారు. అతి తక్కువ కాలంలోనే క్రేజి హీరోల సరసన నటించే అరుదైన అవకాశం సంపాదించిన ఆమె ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో అగ్రకథానాయికల్లో ఒకరిగా భాసిల్లుతున్నారు. ఇలియానా నటించిన కిక్, జల్సా, రెచ్చిపో, సలీమ్ చిత్రాలు ఈ సంవత్సరం ప్రేక్షకుల ముందుకొచ్చాయి. 'కిక్" చిత్రంలో రవితేజ తో పాటు ఆమె కూడా హాస్యాన్ని పండించి గ్లామర్ తోనే కాదు అభినయంతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటాను అని మరోసారి నిరూపించుకున్నారు. రెచ్చిపో, సలీమ్ చిత్రాల్లో కూడా ఆమె తన గ్లామర్ తో ప్రేక్షకులను ఓ మోస్తరుగా ఆకట్టుకున్నారు.
2009 లో 'కిక్" లాంటి ఘనవిజయాన్ని అందుకున్న ఇలియానా 2010 పై ఎంతో ఆశాజనకంగా వున్నారు. ఇటీవలే తమిళ సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన ఆమె అక్కడ విక్రమ్ తో ఒ చిత్రం లో నటిస్తున్నారు. తెలుగులో ప్రస్తుతం ఎన్టీఆర్, మెహర్ రమేష్ ల కలయిలకలో రూపొందనున్న 'శక్తి" చిత్రంలో నటించనున్నారు.


Click it and Unblock the Notifications











