జూ ఎన్టీఆర్ కోసం ఇలియానా బికినీలో...
సలీం వంటి మెగా డిజాస్టర్ ఫిలిం తర్వాత ఇలియానా చేస్తున్న శక్తి చిత్రంలో ఇలియానా బికినీలో కన్పించనుందని సమాచారం. ఈ మేరకు షూటింగ్ పూర్తయిందని తెలుస్తోంది. మొదట్లో బికినీ వేయటానికి ఇష్టపడని ఇలియనా ఎన్టీఆర్ చిత్రం అనగానే ఆమె కాదనకుండా ఒప్పుకుంది. ఇక ఈ సన్నివేశాన్ని సిటీ అవుట్ స్కర్ట్స్ లో ఓ వారం క్రితం రహస్యంగా తీసారని తెలుస్తోంది. యూనిట్ సభ్యులు కు కూడా పూర్తిగా ఈ మ్యాటర్ చెప్పకుండా కొద్దిమందితోనే ఈ షూట్ చేసారు. ఈ రొమాంటిక్ సన్నివేశంలో కథలో ఇలియానా పుట్టిన రోజు సందర్భంగా వస్తుంది. ఆమె స్విమ్మింగ్ పూల్ నుంచి నుంచి తడిసిని బికినీతో బయిటకు రాగానే ఎన్టీఆర్ ఆమెకు హ్యాపీ బర్తడే చెప్తాడు. ఇదంతా రాత్రి పూట జరుగుతుంది. అందుకు షూటింగ్ కూడా అదే సమయంలో పెట్టారు. ఇక ఆ రోజు ఇలియానా షూటింగ్ కి లేటుగా రావటంతో రాత్రి మూడు దాకా అయ్యిందని, అయితే సీన్ సంతృప్తి కరంగా రావటం మెహర్ రమేష్ ఆనందంగా ఉన్నారని చెప్తున్నారు. పక్కా కమర్షియల్ లా రూపొందుతున్న ఈ చిత్రంలో రొమాంటిక్ సన్నివేశాలు కనవిందు చేసి రిపీట్ ఆడియన్స్ వచ్చేలా చేస్తాయని దర్శక, నిర్మాతలు హ్యాపీగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











