'శ్రీ' సినిమాతో పరిచయమై 'హ్యాపీడేస్' తో హైప్ క్రియేట్ అయి అందరి దృష్టిలో పడ్డ అందం తమన్నాది. ఆమె తాజాగా సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా కమిట్ అయ్యిందని వార్తలు వచ్చాయి.ఇందులో అల్లు అర్జున్ హీరో.త్వరలో ప్రారంభం కానున్న ఈ సినిమాతో తమన్నా కు హ్యాపీడేస్ స్టార్ట్ అయ్యాయి అని అందరూ అనుకున్నారు. కాని ఇప్పుడు ఊహించని మార్పులు జరిగి ఆమె ప్లేసులోకి ఇలియానా వచ్చి చేరిందంట.ఇది నిజమైతే మెగా కుటుంబంతో మరో సినిమా చేసే అదృష్టం ఇలియానాకు దక్కినట్లు అవుతుంది. మరి తమన్నా పరిస్ధితి..లక్కీనే అంటున్నారు ఆమె శ్రేయాభిలాషులు. ఎందుకంటే..అంటూ చక్కని లాజిక్ చెబుతున్నారు. సుకుమార్ మొదటి సినిమా ఆర్య హీరోయిన్ అను మెహతా, జగడం హీరోయిన్ ఈషా ఇద్దరూ ఆఫర్లు లేక సోదికి కూడా దొరక్కుండా వెను తిరిగి ముంబాయి వెళ్ళిపోయారు .కాబట్టి తమన్నా సేఫ్ కదా అంటున్నారు. అందని ద్రాక్ష పుల్లన కదా.